Home మంచిర్యాల కలప స్మగ్లింగ్‌కు పాల్పడితే పిడి యాక్ట్

కలప స్మగ్లింగ్‌కు పాల్పడితే పిడి యాక్ట్

PD act on wood Smulging

జన్నారంరూరల్: కల్ప స్మగ్లీంగ్‌కు పాల్పడేవారు ఎంతటి వారైన సరే వదిలి పెట్టేది లేదని అవసరమైతే పిడియాక్ట్ ఉపయోగిస్తామని పిడియాక్ట్ ఉపయోగించి జైలుకు పంపడం జరుగుతుందని ఇందులో ఎలాంటి అనుమానం లేదని మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం రాత్రి జన్నారం ఫారేస్ట్ డివిజన్ కార్యలయంలో జన్నారం, తాల్లపెట్, ఇందన్‌పెల్లి, రేంజ్‌లలో పని చేసే సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎఫ్‌వో ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కల్ప స్మగ్లీంగ్ నిరోధనికి పకడ్బంది చర్యలు చేపట్టడం జరిగిందని రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ పార్టీలో ముమ్మరంగా పెట్రోలింగ్ చేస్తున్నారని అన్నారు.

జన్నారం డివిజన్‌లో అటవీని కాపడుకునే బాధ్యత ప్రజలపైనే ఉందనే విషయాన్ని ప్రజలకు ఆర్థమయ్యే రీతిలో సిబ్బంది. ప్రచారం చేయాలని అడవీని కంటికి రెప్పల కాపాడుకుంటేనే మానవుని మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. ఇప్పటికే ఈ డివిజన్‌లో కల్ప స్మగ్లీంగ్ చేసే వారిపై అనేక కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగిందని కలుపతో దొరికిన వహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డివిజన్ డిఎం రామేష్, జన్నారం,తాల్లపెట్, ఇందన్‌పెల్లి రేంజ్ ఆఫిసర్‌లు షౌఖత్ హుస్సెన్, దేవి ప్రసాద్, ప్రతాప్‌రెడ్డి, డిప్యూటి రేంజ్ ఆఫిసర్, సెక్షన్ ఆఫిసర్‌లు పాల్గొన్నారు.