Home తాజా వార్తలు విద్యుదాఘాతంతో నెమలి మృతి

విద్యుదాఘాతంతో నెమలి మృతి

Peacock Died with Electric shock at Bheamgul

నిజామాబాద్ : విద్యుదాఘాతంతో జాతీయ పక్షి నెమలి మృతి చెందింది. భీమ్‌గల్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మండల కేంద్రంలోని బస్‌డిపో వెనుక ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో చనిపోయిన నెమలిని గమనించిన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. ట్రాన్స్‌ఫార్మర్‌పై ఉన్న నెమలి కళేబరాన్ని తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం నెమలి కళేబరాన్ని పూడ్చి పెట్టినట్టు స్థానికులు తెలిపారు.

Peacock Died with Electric shock at Bheamgul