Search
Saturday 22 September 2018
  • :
  • :

నేటి నుంచి శనగ కొనుగోళ్లు

collectorమన తెలంగాణ/ఆదిలాబాద్: శుక్రవారం నుంచి శనగ కొనుగోళ్లను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ అధికారులను ఆదేశించారు. గురువారం శనగ కొనుగోళ్లపై జిల్లా, మండల రెవెన్యూ, వ్యవసాయ, మార్కెట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి శనగ కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక రైతు 20 క్వింటాళ్లు మాత్రమే మార్కెట్ యార్డుకు తీసుకురావాలని అన్నారు. షెడ్యూల్ ప్రకారం రైతులు గ్రామాల వారీగా మార్కెట్‌కు వచ్చే విధంగా విఆర్‌వో, ఏఈఒలు కూపన్ల జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మార్కెట్ యార్డులో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, జెడి ఆశాకుమారి, ఆర్‌డిఒ సూర్యనారాయణ, మార్కెటింగ్ ఏడి శ్రీనివాస్, పుల్లయ్య, తహసీల్దార్లు వర్ణ, శ్రీదేవి, సంధ్య, రాజేశ్వర్, ఏఒలు శివకుమార్, సాగరిక, అఫ్రోస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments