Friday, April 26, 2024

పోటెత్తిన భక్తజనం

- Advertisement -
- Advertisement -

వనాన్ని తలపించిన జనం జాతర

చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో
జాతీయ రహదారిలో ట్రాఫిక్‌జామ్
సూర్యాపేట నుండి గంట ప్రయాణం
30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

లింగమంతుల స్వామి గుట్ట పొట్టెళ్ల రక్తంతో ఏరులై పారింది.. భక్తులు మొక్కుకున్న మొక్కులు చెల్లించుకునేందుకు పొట్టెళ్లను బలివ్వడంతో రక్తం వరదలా గుట్ట చుట్టూ పారింది. భక్తుల మొక్కులతో పాటు ప్రజలు స్వయంగా బలిచ్చి మొక్కులు చెల్లించారు.

లింగమంతుల స్వామి జాతరకు మొక్కులు వచ్చిన హిజ్రాల నృత్యాలు భక్తులను బోనం కుండలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ గుట్టపైకి వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించి బోనం కుండను సమర్పించారు. వారు చేసిన నృత్యాలు భక్తజనాన్ని అబ్బురపర్చాయి.

Peddagattu Jatara in Suryapet

మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : తెలంగాణలో అతిపెద్ద జాతర.. వనం.. జాతర.. సమ్మక్క సారలమ్మల జాతర.. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆదివాసీల అమ్మల జాతర.. జంపన్న వాగు స్నానాలు.. అమ్మవారి మొక్కులు తీర్చుకోవడంలో లక్షలాది భక్తులు తరిస్తారు. ఆకోవలోనే రెండో అతిపెద్ద జాతర గొల్లగట్టు.. (పెద్దగట్టు) దురాజ్‌పల్లి జాతర.. కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది వనం జాతరను తలపించేలా జనం జాతర హట్టహాసంగా సాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన జాతరకు సూర్యాపేట ఉమ్మడి నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కృష్ణా, అదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి భారీ ఎత్తులో భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర నుంచి కూడా పలువురు యాదవ భక్తులతో పాటు మహారాష్ట్ర గిరిజనులు, ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారు కూడా స్వామి మొక్కులు తీర్చుకునేందుకు పోటీపడ్డారు. మండే ఎండలో బారులు తీరా రాత్రి నుంచి పెద్ద మొత్తంలో వాహనాలు, ట్రాక్టర్ల ద్వారా జనం గుట్టచుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చూసి షామియానాలు ఏర్పాటు చేసుకొని సేదదీరారు. పచ్చటి పొలాల మధ్య అక్కడక్కడ వేసిన షామియానాలు పెద్ద పెద్ద గుడారాల లాగా గుట్టపై నుంచి చూసే భక్తులకు కనువిందు చేశాయి. రాత్రి మూడు గంటల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు బోనాలు ఒండుకొని గొర్రెపోటెళ్లతో గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎక్కడ చూసినా ఏ వైపు నుంచి చూసినా భక్తుల

దారులన్నీ గుట్టపైకే మళ్లాయి.. గజ్జల లాగులు, బేరీల మోతలు.. కటార్ల విన్యాసా పూనకాలు.. పలువురు విన్యాసాలు అక్కడికి వచ్చిన జనాన్ని ఆకట్టుకున్నాయి. ఎటు చూసినా జనం నేల ఈనిందా.. అన్నట్టు ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు హాజరయ్యా ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఏర్పాట్లను అదే రీతిలో చేయించడంలో సఫలీకృతమయ్యారు. ఎక్కడ చూసినా మిషన్ భగీరథ నీళ్లు ఏరులై పారాయి. నీటి కొర త లేకుండా చేయడంతో భక్తులు ఎ ఇబ్బందులు ఎదుర్కొనలేదు. టెంట్ల కింద వంట చేసుకొని భోజనాలు చేసుకున్నారు. గరిడేపల్లి రోడ్డు, కలెక్టరేట్ ఏరి కాశీంపేట, ఇనుపగుట్ట, వల్లభపురం, రాంకోటి తండా పరిసర ప్రాంతాలన్నీ జనంతో కిటకిటలాడాయి. జనం జాతరలో ప్రజలు ఆనందోత్సవాలలో మునిగితేలారు. మద్యం, మాంసం ఇష్టపూర్తిగా ఆరగించారు. దీంతో పెద్దగట్టు జాతర జనం జాతరైంది.
ట్రాఫిక్ జామ్…
గతంలో ఎడ్లబండ్ల మీద వచ్చే భక్తులు ఈ సారి భారీ వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల ట్రాక్టర్లతో గుట్టకు తరలిరావడంతో సూర్యాపేట నుంచి గుట్టవైపు దాదాపు మూడున్నర కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. 5 నిమిషాల ప్రయాణానికి గంట సమయం పట్టింది. గ్రామీణ ప్రాంతాలలో రైతులు, యాదవ భక్తులు కాళేశ్వరం జలాల రాకతో పంటలు సమృద్ధిగా పండించారు. దాదాపు ఊరుకో ట్రాక్టర్ ఉన్న రోజుల నుంచి ఒకే ఊరిలో 50 నుంచి 100 ట్రాక్టర్ల వరకు రైతులు కొనుగోలు చేశారు. దాదాపు ఎడ్లబండ్లు ఎక్కడా కన్పించలేదు. ఆటోలు, ద్విచక్ర వాహనాలపైనే భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అప్రమత్తమైన పోలీసులు..
ఉదయం 8 గంటల వరకు వాహనాల పైన గుట్ట దగ్గరకు వచ్చిన భక్తులే ఉన్నప్పటికీ మధ్యాహ్నం 11 గంటల నుంచి క్రమ క్రమంగా ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఒక దశలో పోలీసులు కూడా నియంత్రించలేని సమయం

ఏర్పడింది. దురాజ్‌పల్లి సమీపంలో బస్సు పోయే వీలుగా బస్సుల కోసం ప్రత్యేకంగా కొంత ట్రాఫిక్‌ను ఒకే దారి నుంచి మళ్లించారు. దీంతో ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ జామవుతోంది. వెళ్లే వాహనాలు కూడా ఇబ్బడి, ముబ్బడిగా వెళ్లడం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ కావడం లేదు. ఈనాడు ఆఫీస్, ఇండస్ట్రీయల్ ఏరియా నుంచి ఆటోలు ఒక వరుస, నాలుగు చక్రాల వాహనాలు ఒక వరుసలో, ఒక వరుసలో ద్విచక్ర వాహనాలను నియంత్రిస్తూ ట్రాఫిక్‌ను మళ్లిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పలువురు వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల పోలీసు సిబ్బంది సరిగా లేకపోవడంతో కొందరు ఆకతాయిలు ముగ్గురు, నలుగురు బైక్‌లపై వెళ్తూ వాహనాలకు ఇబ్బందులు కల్గించారు. ఆటోలు కూడా అదే స్థాయిలో ఇబ్బందులు కల్గిస్తున్నట్లు పలువురు ప్రయాణికులు ఆవేదన చెందారు. పొగ విపరీతంగా రావడంతో కాలుష్యం ఏర్పడుతోంది.
సమీక్షించిన కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్..
జాతరను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌లు సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కింది స్థాయి అధికారులకు సూచనలు, సలహాలు చేస్తూ దిశా నిర్ధేశం చేశారు. దీంతో భక్తులు కూడా కొంత మేర ఉపశమనం పొందారు. ఎండ విపరీతంగా ఉండడంతో వేలాది మంది మర్రిచెట్టు నీడనే సేదతీరారు. గుట్టపైన వెదురు తడకలు వేసినప్పటికీ జనం ఎక్కువగా ఉండడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. పైన ఏర్పాటు చేసిన పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు ఆటంకం లేకుండా భక్తులకు కిందికి పంపించారు.

గుట్ట చుట్టూ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్
కెమెరాలతో జాతర మొత్తాన్ని ఎప్పటికప్పుడు కలెక్టర్ నయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌లు పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటు తలెత్తినా సీసీ టీవీలో చిత్రీకరిస్తున్నందున దగ్గరుండి పర్యవేక్షణ చేశారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిఘా ఉంచారు.

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలోని కోనేరులో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. కోనేరు నడి మధ్య భాగంలో ఏర్పాటు చేసిన విగ్రహం భక్తుల మనస్సులను ఆకట్టుకుంటుంది.

జాతర సందర్భంగా భక్తులకు ఏమైనా ఆరోగ్య పరంగా సమస్యలు తలెత్తితే వైద్య సిబ్బంది అప్రమత్తమై వారికి సేవలు అందిస్తున్నారు. వెను వెంటనే వారిని స్ట్రెచర్ మీద తీసుకెళ్తూ వారికి సేవలు అందిస్తున్నారు. భక్తులు కూడా వైద్య సిబ్బంది సేవలను వినియోగించుకుంటూ దైవ దర్శనానికి వెళ్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News