Home హైదరాబాద్ సాఫీగా సాగిపో!

సాఫీగా సాగిపో!

Pelican signals to cross roads

రోడ్లు దాటేందుకు పెలికాన్ సిగ్నళ్లు
పాదచారులే బటన్ నొక్కి సిగ్నల్ మార్చే వీలు
105 కూడళ్ళలో ఏర్పాటుకు ప్రతిపాదనలు

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగర పాదచారులకు శుభవార్త…! ఇక రహదారులను దాటాలంటే పాదచారులే సిగ్నల్ వేసుకుని మరీ రోడ్డు దాటే సదుపాయాన్ని కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని నగర రవాణా విభాగాలను, ట్రాఫిక్ పోలీసులను, హెచ్‌ఎండిఎను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రవాణా వ్యవస్థను అత్యాధునికంగా, సాంకేతికంగా రూపొందించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. సోమవారం ఎస్.కె జోషి అధ్యక్షతన, సభ్య కన్వీనర్ హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు ఆధ్వర్యాన సచివాలయంలో యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(యుఎంటిఎఉమ్టా) 12వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర పాదచారులు తేలికగా రోడ్లను దాటేందుకు ప్రత్యేకంగా పెలికాన్(పెడెస్ట్రియన్ లైట్ కంట్రోల్ యాక్టివేషన్) సిగ్నల్స్‌ను ప్రధాన కూడళ్ళలో ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో మెరుగైన రవాణా కోసం తీసుకోవాల్సిన చర్యలు, రూపొందించాల్సిన ప్రణాళికలు, చేపట్టాల్సిన పథకాలపై ఈ స మావేశం ప్రత్యేకంగా చర్చించింది. పెలికాన్ సిగ్నల్స్‌తో పాదచారులు సౌలభ్యం గా రహదారులను దాటే వీలుంటుందనేది సమావేశ అభిప్రాయం.

ఇవీ పెలికాన్ సిగ్నల్స్
పెడెస్ట్రియన్ లైట్ కంట్రోల్ యాక్టివేషన్(పెలికాన్) సిగ్నల్స్ అంటే పాదచారులు క్రియాశీలతతో నియంత్రించే లైట్లు అని అర్థం. వీటిని నగరంలోని ప్రధానంగా 105 కూడళ్ళలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఉమ్టా సమావేశంలో ప్రతిపాదించడం జరిగింది. నగరంలో రహదారులను దాటలేని విధంగా వాహనాల రద్దీ విపరీతంగా ఉన్న ప్రాంతాల్లో ఈ పెలికాన్ సిగ్నల్స్‌ను అందుబాటులో కి తీసుకువస్తారు. ఈ సిగ్నల్ ఉన్న ప్రాంతాల్లోని రోడ్లను దాటేందుకు ప్రత్యేకంగా సిగ్నల్ రెడ్ లైట్ పడేందుకు వీలుగా బటన్స్ ఉన్న బాక్స్‌లను ఏర్పాటు చే స్తారు. ఈ బాక్స్‌లకున్న బటన్‌ను నొక్కడంతో ట్రాఫిక్ సిగ్నల్ దానంతటదే రెడ్ సిగ్నల్‌గా వస్తుంది. దీంతో ఆమార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలు నిలిచిపోతాయి. ఫలితంగా పాదచారులు సౌలభ్యంగా ఆ రోడ్డును వేగంగా సౌ లభ్యంగా దాటే వీలుంటుంది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉన్న ఆయా రోడ్లను ఎన్ని నిమిషాల్లో దాటవచ్చును అనేది అధికారులు అంచనా వేసి ఆ బటన్లలో సమయాన్ని ఖరారు(పిక్స్) చేస్తారు. తద్వారా ఆ బటన్ నొక్కగానే ఖరారు చేసిన స మయం వరకు రెడ్ సిగ్నల్ ఉంటుంది. అనంతరం యదావిధిగా గ్రీన్ సిగ్నల్స్ గా మారుతుంటాయి. సాధారణంగా 60, 90 సెకన్ల సమయాన్ని ఖరారు చేస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. 105 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్‌ను ఏర్పా టు చేసేందుకు సుమారు రూ. 3 కోట్లు వ్యయమవుతుందనేది అధికారుల అంచ నా. అయితే వీటి బటన్‌లు తెలిసే విధంగా ప్రాంతీయ, జాతీయ భాషలతో సూ చికలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.

ఇక్కడ ప్రయోగం
భారత దేశంలో చండీఘర్ నగరంలో ఈ తరహా సిగ్నల్స్ రూ. 32 లక్షల వ్య యంతో 16 కూడళ్ళలో ఉన్నాయి. ప్రపంచంలోని ఇంగ్లాండ్‌లో గ్రేటర్ లండన్ విరివిగా వినియోగిస్తున్నారు. ఈ మహానగరంలో 35 కేంద్రాల్లో పెలికాన్ సిగ్న ల్స్ వినియోగంలో ఉన్నాయి. ప్రధానంగా ఒర్పింగ్‌టన్ ప్రాంతంలో ఈ సిగ్నల్స్ సత్ఫలితాలనిస్తున్నట్టు ప్రచారంలో ఉన్నది. అలాగే, ఐర్లాండ్‌లోనూ ఈ తరహా సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ప్రచారంలో ఉన్నది.