Home దునియా అక్షరాన్ని చెరపాలనుకుంటే..అగ్గిపుల్ల!

అక్షరాన్ని చెరపాలనుకుంటే..అగ్గిపుల్ల!

 Eraser

 

పెన్సిల్‌తో రాస్తున్నప్పుడు కొన్నిసార్లు తప్పు దొర్లితే వెంటనే రబ్బరుతో తుడుస్తాం. దానికి భిన్నంగా అగ్గిపుల్లలతో చెరిపోయొచ్చు. అగ్గిపుల్లల్ని గీస్తే మంటొస్తుంది. కానీ పెన్సిల్ రాతలు ఎలా అదృశ్యమైపోతాయని ఆలోచించాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఇక్కడ కనిపిస్తున్నవి అచ్చం అగ్గిపుల్లల్లా తయారుచేసిన రబ్బర్లు.

ఇదేంటీ అనుకుంటున్నారా! అగ్గిపెట్టెలో పుల్లల మాదిరిగా ఉండే రబ్బరు.. వీటిని పిల్లలు స్కూల్‌కి తీసుకెళ్తే పక్క పిల్లలంతా షాకై ఇటు వైపే చూస్తుంటారు. ఒక్కో పుల్లకీ చివర రకరకాల రంగుల్లో చిన్న రబ్బరు ఉంటుంది. దాంతో ఎంచక్కా చెరుపుకోవచ్చన్నమాట. ఈ పుల్ల రబ్బర్లు వినూత్నంగా ఉండడంతో పాటు సన్నగా చిన్నగా ఉండడం వల్ల పక్క అక్షరాలు చెరిగిపోకుండా సరిగ్గా మనం ఏ అక్షరాన్ని చెరపాలనుకుంటే దాన్ని మాత్రమే తుడిపేయొచ్చు. బాగుంది కదూ!