Home అంతర్జాతీయ వార్తలు పెన్‌ఎట్టాక్

పెన్‌ఎట్టాక్

Simona-Halep-Celebration-USక్విటోవాను చిత్తుచేసిన ఫ్లావియా పెనెట్టా
హలెప్ విజయం
సెమీస్‌లో ఫెదరర్ X వావ్రింకా
యుఎస్ ఓపెన్‌లో ఇటలీ భామ ప్లావియా పెనె ట్టా సంచలనం సృష్టించింది. ఐదోసీడ్ పెట్రా క్విటోవాను మ ట్టికరిపించిన పెనెట్టా కెరీర్‌లో రెండో సారి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరింది. మరోవైపు స్థాయి తగ్గ ఆటతో చెలరేగుతున్న రెండోసీడ్ హలెప్.. అజెరెంకాను చిత్తుచేసి తుది నలుగురిలో చోటు దక్కించుకుంది. ఇక పురు షుల సింగిల్స్‌లో ఫైనల్ బెర్తు కోసం స్విస్ వీరులు రోజర్ ఫెదరర్, స్టానిస్లాస్ వావ్రింకా ఆమీతుమీకి సిద్ధమ య్యారు.

న్యూయార్క్ : యుఎస్ ఓపెన్‌లో రెండుసార్లు వింబుల్డన్ విజేత పెట్రా క్విటోవా(చెక్‌రిపబ్లిక్) పోరాటం ముగిసి ంది. ప్రిక్వార్టర్స్‌లో అదృష్టం కొద్ది గట్టెక్కిన క్విటోవా క్వార్టర్స్‌లో చిత్తయిం ది. 26వ సీడ్ ఫ్లావియా పెనెట్టాతో జరిగిన క్వార్టర్స్‌లో క్విటోవా 6-4, 4-6, 2-6తో ఓడిం ది. తీవ్ర మైన ఎండలోనే రెండున్నర గం టల పాటు సాగిన ఈ మ్యాచ్ తొలిసెట్‌లో మొదటిగేమ్‌లో నే క్విటోవా సర్వీస్‌ను కో ల్పోయి ంది. అయితే వెంటనే రెండోగే మ్‌లో పెనెట్టా సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్విటోవా.. మ్యాచ్‌లో బోణీ చేసింది. ఇక అదే జోరు తో మరోసారి పెనెట్టా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్ పాయింట్ మీద నిలిచిన క్విటోవా డబుల్ ఫాల్ట్ చేసి సెట్ పాయింట్‌ను కోల్పో యింది.

అయితే పదోగేమ్‌లో మరో సారి సెట్ పాయింట్ మీద నిలిచిన క్విటోవా ఈసారి ఎలాంటి తప్పిదం చేయకుండా గేమ్‌ను నెగ్గి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక పలుమార్లు డ్యూస్ దారితీసిన రెండోసెట్ తొలిగేమ్‌లో పెనెట్టా డబుల్ ఫాల్ట్‌తో గేమ్ దక్కించుకున్న క్విటోవా తరువాత జోరు కొనసాగించి 3-1తో నిలిచింది. ఈ స్థితిలో ఒక్కసారిగా బ్యాక్ హ్యాండ్ షాట్లతో చెలరేగిన పెనెట్టా కోర్టులో వేగంగా కదులుతూ వరుస గేమ్‌లను సొంతం చేసుకుంది. ఇక మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన పదోగేమ్‌లో రెండుసార్లు సెట్ పాయింట్‌ను కాపాడుకున్న క్విటోవా మూడోసారి మాత్రం బంతిని నెట్‌కు కొట్టి సెట్‌ను సమర్పించుకుంది. అప్పటికే విపరీతమైన వేడితో బాగా అలిసిపోయిన క్విటోవా మ్యాచ్ నిర్ణయాత్మక మూడోసెట్‌లో ఢీలా పడి పోయింది.

దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న పెనెట్టా ఫోర్ హ్యాండ్, నెట్‌గేమ్, డ్రాప్‌షాట్లతో బంతి కోర్టు నలమూల లా కొడుతూ క్విటోవాపై పైచేయి సాధించింది. సెమీ స్‌లో పెనెట్టా రెండోసీడ్ హ లెప్‌తో తలపడనున్నాడు. పలుమార్లు వరుణుడు అడ్డుతగిలిన క్వార్టర్స్ లో హలెప్ 6-3, 4-6, 6-4తో బెలారస్ భామ విక్టోరియా అజ రెంకాపై విజయం సాధిం చింది.

ఫెదరర్ పదోసారి : పురుషుల సింగి ల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదర ర్ పదోసారి సెమీస్‌లో అడుగు పెట్టా డు. టో ర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెట్ కూడా కో ల్పోయి న 34 ఏళ్ల ఫెదరర్ ఆ రికార్డును కొనసాగిస్తూ క్వార్టర్స్ లో 12వ సీడ్ గాస్కెట్(ఫ్రాన్స్)ను వరుస సెట్లలో చి త్తుచే శాడు. 89 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్ 6-3, 6-3, 6-1తో నెగ్గాడు. గాస్కెట్‌తో ఆడిన 17 మ్యాచ్‌ల్లో ఫెదరర్‌కు ఇది 15వ వి జయం కావడం విశేషం. మ్యాచ్‌లో 50 విన్నర్స్ కొట్టిన ఈ స్విస్ మాస్టర్ 16 ఏస్‌లు సంధించాడు. సెమీస్‌లో ఫెదరర్ స్నేహితుడు వావ్రింకాతో తలప డను న్నాడు. ప్రిక్వార్టర్స్‌లో ముర్రేను ముంచిన అండర్సన్ (దక్షిణాఫ్రి కా)ను వావ్రి ంకా 6-4, 6-4, 6-0తో చిత్తుచేశాడు. మ్యాచ్‌లో ఒక్కసారి కూ డా సర్వీస్‌ను కోల్పోని ఐదోసీడ్ వావ్రింకా.. అండర్సన్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌చేశాడు.