Search
Monday 23 July 2018
  • :
  • :

పింఛన్ కు ఇక నో టెన్షన్

Pension deposit in bank accounts soon

రూ.లక్షా 94వేల724 ఆసరా పెన్షన్ దారులకు ఊరట
త్వరలో బ్యాంకుఖాతాల్లో పింఛన్ జమ
పోస్టాపీసుల చుట్టూ ప్రదక్షిణలకు చెక్
రెండు మాసాల్లో అమల్లోకి అవకాశం

లంగాణ ప్రభుత్వం 4 సంవత్సరాల  పరిపాలనా క్రమంలో ఎన్నో వందల పథకాలు ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రజలకు చేరే విధంగా ప్రణాళి కాబద్ధంగా వ్యవహరిస్తుంది టిఆర్‌ఎస్ ప్రభుత్వం. అందులో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆసరా పథకం ద్వారా పంపిణీ చేస్తున్న వివిధ రకాల పింఛన్ దారుల అష్టకష్టాలను కడతేర్చే బాధ్యతను చేపట్టింది. జిల్లాలో ఆసరా పథకం ద్వారా పింఛన్ పొందుతున్న వృద్ధులు, విక లాంగులు, వితంతువుల ఇకపై టెన్షన్ లేకుండా పింఛన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.

మన తెలంగాణ/నల్లగొండ : ప్రజల శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా బంగారు తెలంగాణ బాటలో విజయపరంపరగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం రోజుకో సరికొత్త విధానాన్ని ప్రకటిస్తుంది. దీంతో ప్ర జల్లో రోజురోజుకు విధానపరంగా విస్ర్తుత అభిమానాన్ని చూరగొంటుంది. రాష్ట్రంలోని ఆయా వర్గాల క్షేత్రస్థాయి ఆలోచనలకు అచ్చుగుద్దినట్లుగా పథ కాలు రూపకల్పన చేయడం తదననుగుణంగా కట్టుదిట్టమైన అమలు తో సత్ఫలితాలు సాధిస్తోంది. 4సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనా క్రమ ంలో ఎన్నో వందల పథకాలు ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రజలకు చేరే విదంగా ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అం దులో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఆసరా పథకం ద్వారా పంపిణీ చే స్తున్న వివిద రకాల పింఛన్‌దారుల అష్టకష్టాలను కడతేర్చే బాధ్యతను చేపట్టింది. జిల్లాలో ఆసరా పథకం ద్వారా పింఛన్ పొందుతున్న వృద్దులు, విక లాంగులు, వితంతువుల ఇకపై టెన్షన్ లేకుండా పింఛన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. త్వరలోనే నెలనెలా పింఛన్ పొందే లబ్దిదారులు తమ తమ బ్యాంకు ఖాతాల ద్వారా పొందేందుకు పంపిణీ విధానంలో సరళీకృత విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు పోస్టాఫీసుల ద్వారా పింఛన్ పొందేందుకు వారు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్దం చేసింది. సరికొత్త కార్యాచరణ ప్రారంభమైన నాటి నుంచి పోస్టాఫీస్‌ల నుంచి కాకుండ లక్షా94వేల724 పైచిలుకు మంది లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లక్షా 94వేల 724వేల మందికి ఊరట : పోస్టాఫీసుల ద్వారా కాకుండ బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమచేసే ప్రక్రియ ద్వారా లక్షా94వేల 724 మంది లబ్దిదారులు ఊరట చెందనున్నారు. వీరందరికి ప్రస్తుతం పోస్టాఫీ సు ల ద్వారా పంపిణీ అవుతున్న రూ. 24కోట్ల 93లక్షల 33వేలు ఇకపై బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఈ పాటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ పూర్తిస్థాయి అమలులోకి వచ్చే సరికి మరో రెండు మాసాల సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆసరా పింఛన్ దారు లకు ఇప్పటికే చాలా వరకు బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ మరో 70వేల మందికి ఖాతాలు లేవని వీరందరు కూడా తొందరగా బ్యాంకు ఖాతాలు తెరవాలని ప్రభుత్వం కోరుతోంది. లబ్దిదారులు తమ ఖాతాలకు ఆధార్, ఫోన్ నెంబర్ అనుసంధానం చేయడం ద్వారా ప్రతి నెల పింఛన్ ఖాతాలో జమకాగానే మెసేజ్ రావడం జరుగుతుందని, తద్వారా పింఛన్‌దారులు తమ అనుకూల సమయంలో బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే ఐకేపి బృందాల ద్వారా బ్యాంకు ఖాతాలు ఉన్నవారి నుంచి వివరాలు సేకరించడం, లేని వారిని ఖాతాలు తెరిచే విదంగా చర్యలు చేపట్టడం పనుల్లో నిమగ్నమయ్యారు. తద్వారా లబ్దిదారులకు సంబందించి ఏఏ బ్యాంకుల్లో ఎంతెంత నగదు జమ చేయాలన్న స్పష్టత వచ్చిన వెంటనే వచ్చే రెండు నెలల్లో ఆయా బ్యాంకుల్లో నగదు జమ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
నెలనెల పింఛన్ ఎప్పుడూ ఆలస్యం : జిల్లాలో ఆసరా లబ్దిదారులకు ప్రతి నెలా మొదటివారంలో పంపిణీ కావాల్సిన రూ. 24కోట్ల 93లక్షల33వేల పింఛన్ డబ్బులు ఎప్పుడూ ఆలస్యంగానే అందుతున్నాయి. బ్యాంకుల నుంచి పోస్టాఫీసులకు పింఛన్ డబ్బులు సమయానికి రాకపోవడం మూ లంగా ఈ పరిస్థితి దాపురించింది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా సకాలంలో పోస్టాఫీసులకు డబ్బులు చేరడం లేదని తెలుస్తోంది. నగదు బ ట్వాడా ఆలస్యం వల్ల పింఛన్‌ల పంపిణీకి రెండు నెలల సమయం పడు తోంది. ఒకవేళ పంపిణీ సమయానికి వచ్చినా గంటల తరబడి క్యూలో నిలబడడం, మొదట పింఛన్ కోసం తెల్లవారుజామునే పోస్టాఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సి రావడం వంటి వివిద రకాల ఇబ్బందులు పింఛన్ దారులను వెంటాడుతున్నాయి. ప్రతి నెలా మొద టివారంలో పింఛన్‌ల పంపిణీని పూర్తి చేసే అధికారులు రాను రాను 10వ తేదీకి, అంతటితో ఆగకుండా 15 వరకు కూడా పంపిణీ చేసే గడు వును పొడిగిం చుకుంటూ పోతు ంటే వృ ద్దులు, వికలాంగులు ప్రధా నం గా నానా ఇబ్బందులు ప డాల్సి వస్తుంది. మొత్తా నికి ప్ర భుత్వం ఆస రా పింఛన్ దారుల ఇబ్బందులు గుర్తించి వా టిని సత్వర పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ మరో రెండు మాసాల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ డ బ్బులు జమ చేసే విధంగా చర్యలు చేప ట్టడం పట్ల సర్వత్రా హర్షా తిరే కాలు వ్యక్తమవు తున్నాయి.

పడిగాపుల కష్టాలు పోతాయి
పింఛన్ కోసం పోస్టాఫీసుల కాడ పడిగాపులు కా యాల్సి వస్తోంది. నెలనెల పైసలు వస్తలేవు. బ్యా ం కులో వేస్తే చాలా మంచిగుంటది. అవసర ము న్న ప్పుడు తీసుకోచ్చు. సర్కారు మంచి పనిచేసింది.

చాలా సంతోషకరం
ఫించన్ బ్యాంకుల ద్వారా ఇవ్వడం సంతోష కరం. పోస్టాఫీసులో ప్రతి నెల రాకపోవడం, వచ్చినప్పుడు సాంకేతిక ఇబ్బందులతో ఒకటికి రెండుసార్లు తిరగాల్సివచ్చేది. బ్యాంకుల ద్వారా అయితే ఆలస్యం కాకుండ ఉంటుంది. ప్రభు త్వం మంచి నిర్ణయం తీసుకుంది.

Comments

comments