Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పింఛన్ టెన్షన్

పింఛన్ డబ్బుల కోసం ఫోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
గ్రామ పంచాయతీల ముందు బైఠాయింపులు
వృద్ధులు, వికలాంగుల కష్టాలు పట్టని అధికారులు

PENSION-1

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పండుటాకులకు కష్ట కాలం వచ్చిపడింది. వికలాంగులను ఆదుకోవలసిన పెద్దలు వారి గోడు వినకుండా పోతున్నారు. రెండు నెలలుగా పింఛన్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం నుంచి పింఛన్‌ల పంపిణీ సక్రమంగా జరుగకపోవడంతో వృద్ధులు, వికలాంగు లతో పాటు ఆసరా పింఛన్‌లు అందు కుంటున్న ప్రతి ఒక్కరూ నానా ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ నెలలో ఆలస్యంగా పింఛన్‌లు అందగా డిసెంబర్ నెల చివరికి వచ్చినా ఇంతవరకు పింఛన్ అందక లబ్ధిదారులు ప్రతి రోజు గ్రామాల్లో పోస్టాఫీసులు, గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రోజంతా పడిగాపు కాస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో మెజారిటీ పింఛన్‌దారులకు ఇంతవరకు పింఛన్‌లు అందకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఫించన్ వస్తే గాని బతుకు బండిని ముందుకు తీసుకు పోలేని తాము ఎమి తినాలి.. మందులు ఎలా కొనాలి అంటూ కనిపించిన అధికారులు, ప్రజా ప్రతినిధులపై మండిపడుతున్నారు. గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శిలతో పాటు మండల పరిషత్ కార్యాలయంకు చెరుకుని అధికారుల తీరును నిరసిస్తు దర్నాలు, రాస్తారోకోలు, బైఠాయింపులకు సిద్దం అవుతున్నారు.
మూడు జిల్లాల్లోను ఆదే సీన్..
రంగారెడ్డి, మేడ్చల్,వికారాబాద్ జిల్లాలో సైతం పించన్దారుల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి రోజు పించన్‌దారులు పడిగాపులు కాస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 161367 మందికి పింఛన్‌లు అందచేస్తున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి.
61826 వృద్యాప్య పింఛన్‌లు, 25973 వికలాంగుల పింఛన్‌లు, 71055 వితంతు పింఛన్‌లు, 691 చెనెత కార్మికుల పింఛన్‌లు, 1822 కల్లు గీత కార్మికులకు పింఛన్‌లు అందచేస్తున్న సకాలంలో అందచేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్, డిసెంబర్ నెలల పింఛన్‌లు రాకచాలా మంది కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో గతంలో పనిచేసిన కార్యదర్శిలు పించన్ లబ్దిదారుల స్థానంలో తమ వేలి ముద్రలు వేస్తు వారికి పించన్‌లు అందచేసేవారు. కాని ప్రస్తుతం వారు అక్కడ నుంచి బదిలి కావడంతో పించన్ లబ్దిదారుల వేలి ముద్రలు సరిపోక ఆసలైన వారికి పించన్ రావడం లేదు. మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలో ఇలాంటి వాతావరణం నెలకొనడం వలన దాదాపు 50 మందికి మూడు నెలలుగా పించన్ రావడం లేదని పలువురు లబ్దిదారులు అధికారుల చుట్టు చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటి వాతావరణం చాలా గ్రామాల్లో కనిపిస్తుందని తాము చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. మేడ్చల్ జిల్లాలో 94771 మందికి వృద్యాప్య పింఛన్‌లు పంపిణి చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్న పంపిణి మాత్రం ప్రహసనంగా మారింది. మేడ్చల్ జిల్లాలో వృద్యాప్య పింఛన్‌లు 31061, వికలాంగుల పింఛన్‌లు 17572, వితంతు పింఛన్‌లు 45590, చెనెత కార్మికులు 143, కల్లు గీత కార్మికులు 405 మందికి ప్రభుత్వం పింఛన్‌లు అందచేస్తున్నట్టు ఘనంగా చెప్పుకోవడం తప్ప సకాలంలో చెల్లింపులు రాక ఎకంగా జనం గ్రామ పంచాయతీల ముందు దర్నాలు చేస్తున్నారు. కాప్రా మండలం జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ ముందు ఎకంగా దర్నా చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చెసి వారిని సముదాయించారు.
వికారాబాద్‌లో 101240 మందికి పింఛన్‌లు అందచేస్తున్నట్లు ప్రభుత్వ రికార్డులు తెలుపుతున్నాయి. అందులో 39850 వృద్యాప్య పింఛన్‌లు,, 12378 వికలాంగ పింఛన్‌లు, 47311 వితంతు పింఛన్‌లు, 176 చెనెత కార్మికుల పింఛన్‌లు, 452 కల్లు గీత కార్మికుల పింఛన్‌లు,1073 ఎ.ఆర్.టి రోగులకు పింఛన్‌లు అందచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రోజు ముసలివారు పించన్ కోసం పక్క గ్రామాలకు వెళ్లి సాయంత్రం వరకు వేచిచూస్తున్నారు. బంట్వారం మండలంలో బుదవారం నాడు పొద్దున నుంచి సాయంత్రం వరకు లైన్‌లో వేచిచూసిన పించన్ రాకపోవడంతో పలువురు అధికారులు తీరును నిరసిన చేపట్టారు. మూడు జిల్లాల పరిధిలో ప్రతి రోజు ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్న అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫోస్టాఫిసు సిబ్బంది మాత్రం కావలసినంత డబ్బులు అందడంలేదని అందిన డబ్బులను మాత్రం తాము పంపిణి చేస్తున్నామంటున్నారు. జిల్లా అధికారులు మాత్రం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామంటున్నారు.
ఫించన్ల కోసం ఎంపిడిఓ కార్యాలయం ముట్టడించిన వృద్ధులు
మన తెలంగాణ/బషీరాబాద్ : గత మూడు నెలలుగా ఫించన్ డబ్బులు ఆందలేదని ఆగ్రహించిన వృద్దులు బుదవారం ఎంపిడిఓ కార్యాలయాన్ని ముట్టడించారు.మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది వృద్దులు గత మూడు నెలలుగా గ్రామంలో ఫించన్ డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు.దీంతో కనీస అవసరాలకు సైతం నోచుకోవడం లేదని వృద్దులు వాపోయారు.మూడు నెలలగా ఫించన్ డబ్బులు ఇవ్వక పోవడంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని పస్తులు ఉంటున్నామని వృద్దులు ఆందోళన వ్యక్తం చేశారు.సుమారు రెండు గంటల పాటు ఎంపిడిఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.ఎంపిడిఓ శెట్టిరవి కుమార్ వృద్దులతో మాట్లాడారు,నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల నుండి డబ్బులు రావడం లేదని వచ్చిన కొద్ది డబ్బులను గ్రామాల వారిగా అందజేస్తున్నామని అల్లాపూర్ గ్రామానికి సైతం ఫించన్ డబ్బులు అందజేస్తామని హామి ఇవ్వడంతో వృద్దులు ఆందోళన విరమించారు.

Comments

comments