Home సంగారెడ్డి నరకయానం ఈ ప్రయాణం

నరకయానం ఈ ప్రయాణం

Journey-on-Worst-Road

ప్రయాణీకులకు తప్పని తిప్పలు
పట్టించుకోని అధికారులు

వట్‌పల్లి: వామ్మో.. ఈ దారి ప్రయాణం నరకయానంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ప్రయాణీకులు చెబుతున్నారు. వట్‌పల్లి- జోగిపేట ప్రధాన రహదారి గుండా రేషన్ సరుకులతో ఉన్న లారీ ఆ రోడ్డులో ఇరుక్కుపోయింది. గత కొన్ని రోజుల క్రితం పడిన వర్షానికి బురదలో ఇరుక్కొని అలాగే ఉండిపోయింది. దీంతో ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణీకులు సుమారు 4 గంటలకు పైగా ఇబ్బం దుల పాలయ్యారు. ఇది ముమ్మాటికీ కాంట్రాక్టర్ నిర్లక్షంతోనే ఇలా ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అయితే మండల కేంద్ర మైన వట్‌పల్లి- జోగిపేటకు ప్రధాన రహదారి ఇది. ఈ రోడ్డు గుండా సుమారు 20-30 గ్రామాలకు రహదారి అని, ఈ దారిగుండా నిత్యం వందల సంఖ్యలో వాహ నాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

కానీ సంవత్సరం క్రితం ప్రారంభించిన ఈ రోడ్డు నేటికీ పూర్తికాలేదని చెబుతున్నారు. ఈ రోడ్డు పనులు ప్రారంభించి సుమారు సంవత్సరంపైగా గడుస్తున్నా నేటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని ఆయా గ్రా మాల ప్రజలు చెబుతున్నారు. అయితే కొద్దిపాటివర్షం పడిన వాహనాల రాకపోక లకు ఇబ్బందిగా మారింది. ఈ రోడ్డు గుండా ఆటోలు వెళ్లడానికి సైతం ఇబ్బందిగా మారిందని, పలుమార్లు రోడ్డు విషయమై సంబంధిత అధికారులకు, ప్రజాప్రతి నిధులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తిచేయాలని కోరారు.