Home తాజా వార్తలు నోట్ల రద్దు విషయంలో మోడీ వెంటే ప్రజలు: దత్తాత్రేయ

నోట్ల రద్దు విషయంలో మోడీ వెంటే ప్రజలు: దత్తాత్రేయ

Bandaru_dattatreya

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు పార్లమెంటును అడ్డుకోవడం దారుణమని కేంద్రం మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ….. రాజకీయ ప్రయోజనం కోసమే ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. నల్లధనం వెలికితీసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వెల్లడించారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతూనే ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారని కొనియాడారు. నోట్ల రద్దు విషయంలో ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ వెంటే ఉన్నారని ఆయన చెప్పారు.