Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

‘ ప్రజలే మోడీకి వారసులు : దత్తాత్రేయ ’

BD

హైదరాబాద్ : ప్రధాని మోడీకి వారసత్వం లేదని, దేశ ప్రజలే ఆయనకు వారసులని మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట గురువారం బిజెపి నిర్వహించిన ఒక్క రోజు దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట తన కొడుకు కెటిఆర్‌ను తన రాజకీయ వారసుడిగా తీసుకొస్తున్నారని దత్తాత్రేయ మండిపడ్డారు. ఎపిలో చంద్రబాబునాయుడు కూడా వారసత్వ రాజకీయాలు నడుపుతున్నారని ఆయన అన్నారు. అయితే ప్రధాని మోడీకి ఎటువంటి వారసులు లేరని, ఆయనకు తామే వారసులమని దేశ ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం మోడీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, స్వచ్ఛ భారత్‌ను తీసుకొచ్చి పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిపిస్తున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలన మొత్తం కుంభకోణాల మయంగా మారిందని, నాలుగేళ్ల తన పాలనలో మచ్చ లేని నేతగా మోడీ పేరు తెచ్చుకున్నారని ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకే ప్రజా ప్రతినిధులను పార్లమెంట్‌కు పంపించారే తప్ప సభా సమయాన్ని వృథా చేయడానికి కాదని ఆయన పేర్కొన్నారు.

‘People are Modi’s Descendants : Dattatreya’

Comments

comments