Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ప్రజలే టిఆర్‌ఎస్‌కు హైకమాండ్…

People are the high Command of TRS says Minister Harish Rao

సిద్ధిపేట: ప్రజలే టిఆర్‌ఎస్‌కు హైకమాండ్ అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతే రాజు కావాలన్నది సిఎం కెసిఆర్ లక్ష్యమని చెప్పారు. ఈ సంవత్సరంలోగా కాళేశ్వరం నీళ్లతో దుబ్బాక నియోజకవర్గాన్నిసస్యశ్యామలం చేస్తాయని మంత్రి హమీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 119 గురుకుల పాఠశాలలు ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారని తెలియజేశారు. రానున్న రోజుల్లో మండలానికో గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలన్నదే టిఆర్ఎస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8వేల పెట్టుబడి ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రైతన్నకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ అన్నారు. రైతులు పండించిన పంటకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తోందని మంత్రి హరీష్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ రైతుల అభ్యున్నతికి ఆహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు. మిర్దొడ్డి మండలం అందే గ్రామంలో 33 11కెవి సబ్‌స్టేషన్‌ను హరీష్ ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంఎల్ఎ సోలిపేట రామలింగారెడ్డి పలువురు ప్రముఖలు హజరయ్యారు.

Comments

comments