Search
Monday 24 September 2018
  • :
  • :

బిజెపి కౌన్సిలర్‌ను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి

                    Old-Man

వడోదరలో తమ గుడిసెలను మంగళవారం ఉద యం కూ ల్చేసినందుకు ఆగ్రహించిన జనం గుజరాత్ బిజెపి కౌన్సిలర్ హస్ముఖ్ పటేల్‌ను చెట్టుకు కట్టేసి కొట్టారు. తెల్ల అంగీ చెట్టు కు కట్టేసి ఉన్న అతడిని ప్రజలు నానావిధాలు దూషిస్తున్న వి డియో ఇప్పుడు సామాజిక మీడియాలో చక్కర్లు కొడుతున్న ది. ఈ ఘటనలో దాదాపు 30 మందిని అరెస్టు చేశారు. అతడిపై దాడిచేసిన వారంతా స్థానికులే. ఎలాంటి నోటీస్ లేకుం డా తమ ఇళ్లను కూల్చేశారని వారు ఆరోపించారు. కొంత మంది వడోదర మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ల గా, అక్కడ అధికారులు నోటీసును స్థానిక కౌన్సిలర్ పటేల్‌కు పంపామని చెప్పారు. దాంతో ఆగ్రహోదాగ్రులైన ప్రజలు హ స్ముఖ్ పటేల్‌తో వాదోపవాదాలు చేశారు. తనకెలాంటి నోటీ సు అందలేదని ఆయన చెప్పినప్పటికీ రెచ్చిపోయిన జనం ఆ యనను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ‘ఇళ్లు కూల్చేస్తుంటే ఎందుకు వారించలేదు’ అని మరీ చితకబాదారు. ప్రజలు ప్రశ్నలు అడుగుతున్న ప్రతిసారి ఆయన గొణిగారు. దానికి రెచ్చిపోయిన ప్రజలు నానా విధాల దూషించారు. కాగా కూల్చేసిన ఇళ్లు అక్రమమైనవని పౌర అధికారులు చెప్పారు.

Comments

comments