Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

మా గోడు పట్టించుకునే నాథుడే లేడా!

People face problem with Cancel of RTC Bus in Miryalaguda Route

సూర్యాపేట మిర్యాలగూడ రూట్లో కనిపించని ‘పల్లె వెలుగు’
డ్రైవర్లు తక్కువ ఉంటే ఈ రూటుకు బస్సులు లేనట్టే
అధికారులు చెప్పినా వారి మాట వినని ఆర్టీసీ సిఐ

మన తెలంగాణ/పెన్‌పహాడ్: ‘అన్నారం, మిర్యాలగూడ రూట్ బస్సుకు ఆర్టీసీ అధికారులు మంగళం పాడారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు రాదో.. తెలియ క ఇదో తిక్కల్ బస్సు వ్యవహారంగా మారింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ, బస్సు కెఎంపిఎల్, ఆదాయం బాగానే వస్తున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు బాగా రద్దీగా ఉండే ఈ రూటు బస్సునే ఎందుకు ఆపుతున్నారో తెలియకుండా ఉంది. సాక్షాత్తు మంత్రి జగదీశ్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ ప్రయోజనం లేదు. బస్సు సౌకర్య లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మా గోడు పట్టించుకునే నా ధుడే లేడని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగు పర్చాలనే ఉద్దేశ్యంతో పల్లె వెలుగు సర్వీసులకు ఆర్భాటంగా ప్రవేశపెట్టి ఆచరణలో మాత్రం కన్పించడం లేదు. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట, మిర్యాలగూడెం డిపో ఫర్ కేషన్‌లో భాగంగా సూర్యాపేట డిపో బీమారం మిర్యాలగూడ, – మిర్యాలగూడెం డిపో నాగులపా టి అన్నారం, మిర్యాలగూడ రూట్లను ఎంచుకున్నారు. అన్నారం మిర్యాలగూడెం రూట్‌లో రెండు నియోజకవర్గాలున్నాయి. సూర్యాపేట నుంచి అన్నారం వరకూ సూర్యాపేట నియోజకవర్గం దాసారం నుంచి మిర్యాలగూడ వరకు మిర్యాలగూడెం నియోజకవర్గం ఉండడంతో నాయకులు అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో అన్నారం మిర్యాలగూడెం గంటకు లేకుండా ఉండేది. గత ఆరు నెలల నుంచి ఒక్కటే బస్సు ఉదయం నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతారం నుంచి మిర్యాలగూడెం వెళ్లడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతినిత్యం అనంతా రం, పొట్లపహాడ్, అన్నారం, దాసారం, ముకుందాపురం,కల్లూరు,సోమవా రం, చిల్లెపల్లి వరకు ప్రతిరోజు వ్యాపారం రీత్యా మిర్యాలగూడ వెళ్తారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, టీచర్లు వివిధ ప్రాంతాలకు స మాయానికి వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. డిపో మేనేజర్‌కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు సూర్యాపేటనుంచి రెండు బస్సుల మిర్యాలగూడెం నుంచి రెండు బస్సులు బయలుదేరేవి. రెండు బస్సులు సూర్యాపేటకు, మిర్యాలగూడెంకు తిరుగుతుండడంతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేవి. మొదట ఒక బస్సు తగ్గించి ఒ క్క బస్సే నడిపి తర్వాత ఆ ఒక్క బస్సుకు కూడా తీసివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అనేక సంవత్సరాలుగా మిర్యాలగూడ డిపోలో ఆర్టీసీ సిఐగా విధులు నిర్వర్తిస్తున్న సిఐ అన్నారం, మిర్యాలగూడ రూట్ పట్ల కక్షగట్టి బస్సు బంద్ చేస్తున్నారని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ రూ టులో తిరిగే ఆటోవారి నుంచి సిఐ మామూళ్లు పుచ్చుకొని ఆర్టీసీ బస్సు రాకుం డా అడ్డుపడుతున్నారని పలువురు ప్రయాణికులు వాపోయారు.

స్పందించని ఆర్టీసీ అధికారులు: ప్రజలు తీవ్ర ఇక్కట్లను దృష్టిలో పెట్టుకొని పలుమార్లు ఆర్టీసీ అధికారులను కలిసినప్పటికీ స్పందన లేదు. పది గ్రామాల సర్పంచ్‌లు, జెడ్పిటిసి, ఎంపిటిసిలు, వార్డు సభ్యులు, ఇతర విద్యార్థి, మహిళా సంఘాల వారు వెళ్లి కలిసినప్పటికీ, పలుమార్లు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేదు. -గంగారాధమ్మ, మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు

ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు: నేను గత 15 సంవత్సరాల నుంచి మిర్యాలగూడలో వ్యాపారం చేస్తున్నా ను. ప్రతి నిత్యం ఉదయం మిర్యాలగూడ వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వస్తాను. గత ఆరు నెలల నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. రెండు నియోజకవర్గాలు ఉండడంతో ఏ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. -పొదిల కృష్ణ, అనంతారం గ్రామం

ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి: మా ఊరు నుండి మిర్యాలగూడ వెళ్లాలంటే బస్సు సౌకర్యం తప్ప వేరే మార్గం లేదు. మా ఊరు నుండి సుమారు పది పదిహేను మంది ప్రతినిత్యం మిర్యాలగూడ పనిమీద వెళ్తుతున్నారు. మిర్యాలగూడెం దూరం ఉండడంతో ఆటోలు సైతం రావడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని సౌకర్యం కల్పించాలి. -రాములు, పొట్లపహాడ్ గ్రామం 

Comments

comments