Home జిల్లాలు పిచ్చి చేష్టలతో కల్తీ కల్లు ప్రియులు

పిచ్చి చేష్టలతో కల్తీ కల్లు ప్రియులు

Untitled-1గద్వాల: కొన్నేళ్లుగా కల్లు మత్తుకు అలవాటు పడిన కల్లుప్రి యులు ఎక్సైజ్ దాడుల నేపథ్యంలో దుకాణాలు మూతపడడంతో దిక్కు తోచక పిచ్చెక్కి పోతున్నారు. గడిచిన కొన్నాళ్లుగా వింత ప్రవర్తన, పిచ్చి చేష్టల తో ఆసుపత్రుల పాలవుతున్నవారు చికిత్స పొందుతుండగా సోమవారం పట్టణంలో కల్లుప్రియులు వింత చేష్టలతో ప్రజలను కలవరానికి గురి చేశారు. గద్వాల మండలం తెలుగోనుపల్లికి చెందిన లక్ష్మీ, అయిజ మండ లానికి చెందిన లలు తమ భర్తలతో కలిసి గద్వాలకు రాగా, ఆకస్మాత్తుగా పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో బిత్తరపోయిన భర్తలు వారిని అదుపు చేయలేక అవస్థలు పడ్డారు. వీరికి పోలీసులు సహాయం అందించడం కొసమెరుపు. సహాయం చేసేందుకు వచ్చిన పోలీసులతోనే బాధిత మహిళ వాగ్వివాదానికి దిగడం విశేషం. అనంతరం వీరిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు సోమవారం డివిజన్ పరిధిలోని పలు గ్రామాల వ్యాప్తంగా కల్లుప్రియులు ఇదే రకమైన ప్రవర్తనతో స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నట్లు సమాచారం.
కలవరపెడుతున్న కల్తీకల్లు
విస్తృతంగా ఎక్సైజ్ అధికారుల దాడులు
అలంపూర్: అలంపూర్ నియోజకవ ర్గంలోని మానవపాడు, ఇటిక్యాల, వడ్డెపల్లి, అలంపూర్ మండలాల్లో కల్తీకల్లు కలవరపెడుతోంది. ఎక్సైజ్ పోలీసులు
విస్తృతంగా కల్తీకల్లుపై దాడులు నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా గ్రామాల్లో పర్యటించి కల్లు నమూ నాలు సేకరిస్తున్నారు. మత్తు పదార్థాలు కలిసి ఉంటే కల్లును పారబోస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా కల్తీకల్లును సేవించడం వల్ల కల్లు తయారీలో కలిపే మత్తు పదార్థాలకు కల్లు ప్రియులు బానిసలుగా మారిపోయారు. మత్తు కల్లు లేకపోతే శరీర అవయవాలు తమ ఆధీనంలో ఉండవని, ఇది తాగితేనే మేము పని చేయగలుగుతామని కల్లు ప్రియులు ఎక్సైజ్ పోలీసుల ముందు వాపోతున్నారు. మరి కొన్ని గ్రామాల్లో కల్తీకల్లును ఎందుకు పారబోస్తున్నారని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. కల్తీకల్లు అమ్మకాలను అడ్డుకోవద్దని కొందరు కల్లుప్రియులు ప్రాథేయపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి గ్రామంలో స్వచ్ఛ మైన కల్లును మాత్రమే అమ్మాలని, కల్తీకల్లు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ అనంతయ్య తెలిపారు. ప్రతి గ్రామంలో కల్తీకల్లు దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే వేల లీటర్ల కల్తీకల్లును పారబోసి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కల్తీకల్లు లేకపోవడంతో నియోజకవర్గంలో ఇప్పటి వరకు 19మంది అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. తక్కశిల గ్రామంలో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు.