Home జోగులాంబ గద్వాల్ అవినీతి రాజకీయాల వలలో ప్రజలు: ఆంజనేయులు గౌడ్

అవినీతి రాజకీయాల వలలో ప్రజలు: ఆంజనేయులు గౌడ్

People in the trap of corruption politics: Anjaneya Goud

మన తెలంగాణ/గద్వాల న్యూటౌన్: పట్టణంలో గత కొన్ని ఏళ్ళు నుంచి ప్రజలు అనచివేత రాజకీయలో గడుసున్నరని , పేదవారు పెత్తాందారు క్రింద జీతాన్ని గడుపుతున్నారని బిసి కమీషన్ సభ్యులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక బృందావన్ ఫంక్షన్ హాల్‌లో నడిగడ్డ యువత ఆలోచనల పండుగ కార్యాక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజకీయం గురించి తెలియని నేత గ్రామాలల్లో రాజకీయ సంచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. యువతతోనే జిల్లాలో మార్పు చేసి చేపిస్తామని సూచించారు. జిల్లాలో ప్రజలు అవినీతి వలల్లో చీక్కుకున్నారని ఆరోపించారు. పట్టణంలో కొన్ని ఏళ్ళ నుంచి ఒక్కే కుటుంబం పాలనలో ప్రజలు బానిసత్వంలో జీవనం సాగిస్తున్నారన్నారు. నేటి వరకు జిల్లాలో ఆభివృధ్ది చేస్తున్నమని ప్రచారాలు చేస్తున్న నాయకులు దందాలల్లో అభివృద్ది చేసుకున్నారని విమర్శించారు . నడిగడ్డ యువత మేలుకోంటుందని తెలిసి ఇప్పుడు మీ గుండేలల్లో రైలు పరెగేతున్నాయని పెర్కోన్నారు. నడిగడ్డ యువత ఇప్పటికే చాలా రకాల పనులు చేశారని వారిని ఆభినందించారు. రాబోయే రోజులో ప్రజలే మీకు తగిన గుణ పాఠం చేప్పాతారని వ్యానించారు. పేదవారికి మరియు నడిగడ్డ సభ్యులపై బెదిరింపు రాజకీయలు చేస్తే ఉరుకునేది లేదని హెచ్చరించారు. యువతలకు సమాజంలో జీవించడానికి క్రమశిక్షణ చాలా అవసరం అదే విధంగా నైతిక విలువలతో సమాజంలో మెలగాలరని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కేట్ యార్డు లక్ష్మీదేవమ్మ, భాస్కర్, అవనీశ్రీ, మెడికోండ ప్రసాద్, అన్ని మండలలా నడిగడ్డ యువత సభ్యులు, మహిళలు, పాల్గొన్నారు.