Home తాజా వార్తలు అంచనాలు వేశారు… నిర్మాణాలు మరిచారు

అంచనాలు వేశారు… నిర్మాణాలు మరిచారు

 People in tribal villages do not have trouble

గుండాల: వర్షాకాల సీజన్ వచ్చిందంటే మండలంలోని చుట్టు ఉన్న గిరిజన గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మండల కేంద్రానికి చుట్టు ఉన్న కిన్నెరసాని, మల్లన్నవాగులతో పాటు సాయనపల్లి పంచాయితీలోని ఏడుమెలికల వాగు, శెట్టిపల్లి పంచాయితీలోని నడివాగు, రాల్లవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గిరిజన ప్రజలు రోజుల తరబడి జలదిగ్బందంలో ఉండాల్సిన పరిస్థితి మండలంలో నెలకొంది. సాయనపల్లివద్ద కిన్నెరసాని, గుండాల వద్ద మల్లన్నవాగులపై వంతెనల నిర్మాణం కోసం గత మార్చిలో నెలలోఆర్‌అండ్‌బి మరియు పిఆర్ శాఖల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు వేసినప్పటికి టెండర్ల ప్రక్రియకు నోచుకోలేదు. అలాగే శెట్టిపల్లి పంచాయితీలోని నడివాగు, రాళ్ళవాగులపై టెండర్ పనులు పూర్తై గుత్తేదారు పనులను ప్రారంభించి మద్యలోనే నిలిపి వేశారు. కారణం ఏమిటో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో నిత్యం వివిధ పనుల కోసం మండల కేంద్రానికి వచ్చేందుకు నాన అవస్థలకు గురౌతున్నపరిస్థితి నెలకొంది. ఇక వ్యాదుల బారిన పడిన రోగులు ప్రాథమిక వైద్యం కోసం మండల కేంద్రానికి వచ్చేవారి పరిస్థితి దయానీయంగా మారింది. గర్భీణిలు, బాలింతలు అవస్థలు చెప్సలేని విధంగా మారాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిథులు మారుమూల మండలంపై ప్రత్యేక దృష్టిని సారించి వాగులపై యుద్ద ప్రతిపాదికన వంతెనల నిర్మాణం చేపట్టాలని ప్రజలు కొరుకుంటున్నారు.