Home మెదక్ మెదక్ వొద్దు.. సంగారెడ్డి ముద్దు

మెదక్ వొద్దు.. సంగారెడ్డి ముద్దు

Road-Bandhనాడు తెలంగాణ కోసం.. నేడు సంగారెడ్డి కోసం
నర్సాపూర్‌ను సంగారెడ్డిలో కలపాలంటూ  రాస్తారోకో
అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు
అంబేద్కర్ చౌరస్తాలో గంటసేపు స్తంభించిన రవాణా
రోడ్డుపై బైఠాయించిన నర్సాపూర్ ప్రజలు
నాయకుల అరెస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
పోలీస్ స్టేషన్‌లో సైతం నిరసన
మన తెలంగాణ/నర్సాపూర్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో నర్సాపూర్‌ను సంగారెడ్డిలోనే కలపాలంటూ అఖిల పక్షం ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో మండల ప్రజలు అఖిలపక్షం నాయకులు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వ హించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయా యి. నర్సాపూర్ మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని చూస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని నర్సా పూర్ మండల ప్రజల ఆకాంక్షను తెలుసుకుని సంగారెడ్డి జిల్లాలో కలపాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తమ విన్నపానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవా లని చూస్తే మరో తెలంగాణ ఉద్యమంలా నర్సాపూర్‌ను సంగారెడ్డిలో కలుపుతామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చేవ రకూ ఉద్యమిస్తామంటూ వారు ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. రాస్తారోకోతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోవడంతో ఎస్‌ఐ వెంకటరాజగౌడ్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని నిరస చేపడుతున్న వారిని బలవంతం గా అక్కడి నుండి డిసిఎంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, అఖిలపక్షం నాయకులు అక్కడ కూడా తమ నిరసనను వ్యక్తం చేశారు.

సిర్పూర్ (యు)ను ఆదిలాబాద్‌లోనే ఉంచాలి
మన తెలంగాణ/సిర్పూర్(యు): సిర్పూర్(యు) మండ లాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంచాలని కోరుతూ ఊరూరా నిర్వహిస్తున్న గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం 11 గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన మహాసభను ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, గ్రామ గిరిజనులు ఈ తీర్మాన పత్రాలను అధికారులకు అందజేశారు. దశాబ్దాలుగా ఆదిలాబాద్‌లో జిల్లాలో కొన సాగుతున్న మండలాన్ని ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకొ ని మంచిర్యాల జిల్లాలో కలపడం సరికాదని, దీనిని పూర్తి గా వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం మండల ప్రత్యేక అధికారి రాథో డ్ రామారావు, ఎంపిడిఒ శశికల ఠాగూర్, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్‌లు, పలు మండలాలలోని 11 గ్రామ పంచా యతీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సిర్పూర్(యు) మండలాన్ని ఆదిలాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని తీర్మానిస్తూ పత్రాలను అంద జేస్తారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మా ట్లాడుతూ 75 కి.మీ. దూరంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా తమకు అనుకూలంగా ఉందని, ఎలాంటి సంబంధం లేని 140 కి.మీ. దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లాలో కలప డం ద్వారా పాలన కుంటు పడి అభివృద్ధిలో వెనుకబడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు, ఆత్రం భగవంత్ రావ్, ఆత్రం మొగులయ్య, ఆత్రం ఓం ప్రకాశ్, ఆత్రం పబ్బా రాజేశ్వ ర్, సుమలత ఈశ్వర్, అర్క నాగారావు, ఆత్రం జాలీం షా, ఆత్రం సొడాం బాయి, సత్తు బాయి, ఆయా గ్రామా ల యువజన సంఘాలు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

సొనాలను మండలంగా గుర్తించండి
మన తెలంగాణ/బోథ్: సొనాల గ్రామాన్ని మండలంగా గుర్తించాలని సొనాల గ్రామ పంచాయతీ పరిధిలోని దాదాపు 8 గ్రామ పంచాయతీల ప్రజలు స్థానికులు మం గళవారం బోథ్ తహసీల్దార్ ప్రభాకర్‌కు వినతిపత్రం సమ ర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టి ఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి బివి రమణ మాట్లాడు తూ సొనాల గ్రామ పంచాయతీ సమీపంలో 8 గ్రామ పంచాయతీలున్నాయన్నారు. ప్రజలకు బోథ్ దూరం కా వడంతో సొనాల గ్రామాన్ని మండలంగా చేసినట్లైతే ఎం తో మేలు కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరి పాలన సౌలభ్యం కోసం మండల జిల్లాల పరిపాలన సు లువుగా సాగేందుకు సన్నద్ధం కావడంతో తామందరం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. మండలంలో దాదాపు 50వేల చిలుకు ప్రజలు నివసిస్తున్నారని అన్నా రు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాల సర్పంచులు ఎంపి టిసి, ప్రజలు పాల్గొన్నారు.