Home జయశంకర్ భూపాలపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

Summerములుగు జిల్లా ప్రతినిధి : పది రోజుల పాటు ఎండల తీవ్రత, వడగాల్పులు  అధికంగా ఉండే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో ఎండల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు 10 రోజుల పాటు అత్యవససరమైన పనులు మినహా ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎట్టి పరిస్థితిలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరం వైద్య సేవలు అందిస్తామని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వడదెబ్బ బారిన పడే వారు వెంటనే సమీపంలో గల ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలని ఆయన సూచించారు. వృద్ధులు , చిన్నారులు, బాలింతలు, గర్బిణి స్త్రీలు అనారోగ్యంతో ఉన్న వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉపాధి హామీ కూలీలు వీలైనంత త్వరగా ఉదయ పూటనే పనులు ముగించుకోవాలని సూచించారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పండ్లు , రసాలు, శీతల పానియాలను సేవింంచాలని చెప్పారు. బయటకు వెళ్లే సమయంలో నూలు దుస్తులు, నెత్తిన టోపి ధరించాలని అయిన సూచించారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు బయటకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

People Should Be Alert With Summer