Search
Thursday 15 November 2018
  • :
  • :

అదే పనిగా కూర్చుంటే ఇబ్బందులే!

Women-Sittingఆఫీసులో ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఇంట్లో కూడా ఏమీ పనిలేకుండా టీవీ చూస్తూ గంటలు గంటలు కూర్చొని ఉంటే కూడా మీరు రోగాలను ఆహ్వానించినట్లేనని అనేక పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఎక్కువ సమయం కూర్చొని ఉండటం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఎక్కువ సమయం కూర్చొనేవారు క్యాన్సర్‌వ్యాధి బారిన పడుతున్నట్లు తేలింది. వీటితో పాటు గుండె జబ్బులు, పక్షవాతాలే కాదు పలురకాల జబ్బుల బారినపడుతున్నట్లు పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చారు. సాధా రణంగా పొగతాగడం వల్ల గుండెజబ్బులు, పక్ష వాతం బారినపడే అవకాశాలు సాధారణం కన్నా నాలుగురెట్లకు పెరుగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇదేకాదు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే, అందరూ పొగ తాగకపోవచ్చు కానీ, దాదాపు చాలామంది ఎక్కువ గంటలు కూర్చుని ఉంటారనేది వాస్తవం.

చాలా మంది రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటారు. ఇలాంటివారు పలురకాల వ్యాధుల బారినపడుతున్నారని ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది. రోజూ అరగంట పాటు వ్యాయామం చేసే వారు సైతం ఎక్కువగంటలు కదలకుండా కూర్చుని ఉంటే వారు పలరకాల వ్యాధుల పాలవుతారని అధ్యయ నాల్లో సృష్టమైంది. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కండరాల శ్రమ పూర్తిగా ఆగిపోతుందని, దీనివల్ల శరీరం పలురకాల దుష్ర్పభావాలకు లోనవు తుందని చెపుతున్నారు. వాస్తవానికి కండరాల ప్రక్రియలో రక్తంలోని చక్కెర విలువల్ని శరీరమంతా వ్యాపింప చేస్తాయి. రక్తంలోని కొవ్వు పదార్థాలను శక్తిగా మారుస్తాయి. మామూలుగా అయితే నడుస్తున్నప్పుడు లేదా కనీసం నిల్చొని ఉన్నప్పుడు శరీరంలోని అత్యధిక కండరాలు రక్తంలోని షుగర్‌ను, కొవ్వు పదా ర్థాలను సంగ్రహిస్తాయి. అయితే ఎక్కువ గంటలు కూర్చుని ఉండ డం వల్ల రక్తంలోని షుగర్ లేదా కొవ్వు సామాన్య స్థితికి రాలేదు. పైగా ఎక్కువ సమయం కూర్చునే ఉండటం వల్ల రక్త నాళాలు తమ సహజమైన సంకోచ, వ్యాకోచ సామర్థ్యాన్ని (ఎండో థీలియల్ ఫంక్షన్) కోల్పోతాయి. ఈ స్థితి ఎక్కువ కాలం సాగితే, అది శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వ లు పెరగడానికి, మధుమేహం రావ డానికి దారి తీస్తుందని పరి శోధకులు వివరిసున్నారు. మిగులు శక్తి అంతా కొవ్వుగా మారి రక్తనాళాలు దెబ్బ తినడానికి కారణ మవుతుంది.
చివరకు గుండె రక్తనాళాలు దెబ్బతిని గుండె జబ్బులు రావడానికి గానీ, పక్షవాతం రావడానికి గానీ దారితీయవచ్చు. ఇవేకాదు దాదాపు మరో 34 రకాల విషమ పరిస్థితులకు దారితీయ వచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

comments