Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

50 దాటినా అదే రద్దీ

తీరని కరెన్సీ కష్టాలు
బ్యాంకుల ముందు బారులు తీరిన జనం

Demonetisation1కాటారం: ప్రధాని కరుణించినా.. బ్యాంకర్లు అభయమివ్వడం లేదు.50రోజుల తర్వాత సామాన్య ప్రజల కష్టాలు ఉండవని స్వయాన భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినా ఆ హామీ నెరవేర్చడంలో విపలమైందనే చెప్పుకోవచ్చు. యాభై రోజులు దాటినా బ్యాంకుల ముందు జనం కరెన్సీ కోసం ఎగబడి బారులు తీరుతున్నారు. భారతదేశ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఏటిఎంల ద్వారా రూ.4500లు డ్రా చేసుకోవచ్చని ప్రధాని ప్రకటించారు. కానీ కాటారంలో ఉన్న ఎస్‌బిహెచ్ ఏటిఎం ఎల్లప్పుడూ మూసి జనానికి దర్శనమిస్తుంది.

 50రోజులు దాటిన తర్వాత అవినీతి పరులకు మాత్రమే వణుకు పుడుతుందని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయినా మండలకేంద్రంలో ఉన్న ఎస్‌బిహెచ్, టిజిబి, కెడిసిసి, ఆంధ్రాబ్యాంక్‌ల వద్ద జనం మంగళవారం ఉదయం 8గంటల నుండే క్యూలో తండోపతండాలుగా బారులు తీరారు. రైతులు వ్యవసాయ పనులు సైతం వదులుకొని పత్తి చేలల్లో పనులు చేస్తున్న కూలీలకు కూలీ డబ్బులు చెల్లించేందకు  ఉదయం నుండి సాయంత్రం వరకు బ్యాంకుల ముందు క్యూలో నిలబడి 2-4వేల రూపాయలు డ్రాచేసుకొని నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు.

కొత్త సంవత్సరంలోనైనా కరెన్సీ కష్టాలు తీరుతాయనుక్ను ప్రజలకు నిరాశ ఎదురైంది. నూతన సంవత్సరం కానుకగా ప్రధానమంత్రి రూ.4500లు ఏటియం ద్వారా డ్రా చేసుకోవచ్చు అనే సంతోషం కూడా జనానికి నిరాశ మిగిల్చింది. మండలలకేంద్రంలో ఉన్న ఏటిఎం వద్దకు వెళ్లి చూస్తే మూసుకొని ప్రజలకు దర్శనమిస్తుంది. చేసేదేమి లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ కష్టాలు ఇంకెన్నాలంటూ ఆందోళన చెందుతున్నారు.

Comments

comments