Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) మేడ్చల్ కలెక్టరేట్ వద్ద సిపిఐ మహాధర్నా

మేడ్చల్ కలెక్టరేట్ వద్ద సిపిఐ మహాధర్నా

People Strike For Double Bed Room House IN medchal

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా : ప్రభుత్వ భూములను పరిరక్షించాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదల ఇళ్లను రెగ్యూలరైజ్ చేయాలనే డిమాండ్‌తో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మహా ధర్నా నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి తరలివచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు మహాధర్నా నిర్వహిస్తుండగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా స్థలిలో వంటావార్పు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకుంటే ప్రజలచే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో అనేక వాగ్ధానాలు చేసిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హామీలను అమలు పరచడంలో విఫలమయ్యారని విమర్శించారు. రైతుబంధు పథకం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడాబాబులకు ఉపయోగ పడుతుంది తప్ప చిన్నకారు, సన్నకారు రైతులకు ప్రయోజనం లేదని అన్నారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన టీడీపీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అవహేళన చేసిన కేసీఆర్ తమ ప్రభుత్వంలో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని నమ్మబలికి మోసగించారని ఆరోపించారు. మహాధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, కార్యవర్గ సభ్యులు విఎస్.బోస్, జిల్లా కార్యదర్శి ఐలయ్య, సహాయ కార్యదర్శి సీహెచ్.దశరథ్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు టి.వీరేందర్ గౌడ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్‌రెడ్డి, డిజి సాయిలు గౌడ్, జె.లక్ష్మీ యాదవ్, జి.వరమ్మ, రొయ్యల కృష్ణమూర్తి, టి.శంకర్, శంకర్‌రావు, వెంకటేశ్, జిల్లా పార్టీ నాయకులు కె.సహాదేవ్, యాదయ్య గౌడ్, బాల్‌రాజ్, రాములు గౌడ్, అశోక్, లక్ష్మీనారాయణ, గిరిజ తదితరులు పాల్గొన్నారు.