Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

వణికిస్తున్న జ్వరాలు .. దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులు

fever

ఖమ్మంః జిల్లా లో గత కొన్ని రోజులుగా ఏర్పడ్డ వాతవరణ పరిస్థితుల్లో వేలాది మంది ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారు. దీన్ని ఆసరగా చేసుకొని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అందిన కాడికి దోచుకునే ధొరణిలో ఉన్నాయి. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ క్షేత్ర స్ధాయిలో విఫలం చెందింది. ఈ నేపధ్యంలో జిల్లా మొత్తం జ్వరంతో వణికిపోతుందని చెప్పవచ్చు . డెంగ్యూ , చికెన్ గున్యా , మలేరియా, టైఫాడ్ , స్వైన్‌ఫ్లూ , వంటి తీవ్ర స్ధాయి జ్వరాల పేర్లు చెప్పి ప్రజలను వైద్యులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా టెస్టుల పేరుతో నయా దోపిడికి తెరలేపి రోగులు ప్రాణభయంతో పరుగులు పెట్టెలా చేస్తున్నారు.
ఆరోగ్యశాఖ లెక్కలు ఇలా ఉన్నాయి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు తెలిపిన ప్రకారం గత మార్చి నుంచి ఇప్పటి వరకు నమోదైన మలేరియా కేసులు 1000 కి పైగా ఉన్నాయి. డెంగ్యూ జ్వరాలు 245, చికెన్‌గున్యా జ్వరాలు 25, స్వైన్‌ఫ్లూ కేసు ఒకటి నమోదు కాగా సదరు వ్యక్తి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇవి అధికారిక లెక్కలు అయితే అనధికారికంగా జ్వరాల భారిన పడుతున్నవారు వేలాది మంది ఉన్నారనేది అందరు అంగికరించే వాస్తవం . జిల్లా లోని 58 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు , ఆరు ఏరియా ఆసుపత్రులు , రోగులకు సేవలందిస్తుండగా వీటిలో జ్వర పీడితులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు దందా నిరాటంకంగా కోనసాగుతుంది.
టెస్టులతో చెస్ట్ పెయిన్ గ్యారంటీ
సాధారణ జ్వరాలు మందులకు లొంగనపుడు జ్వరాల తీవ్రత ను తెలుసుకొవటం కోసం టెస్టులు రాయాలి. కాని మాములు జ్వర పీడితులకు కూడా మలేరియా మొదలకొని డెంగ్యూ వరకు ఎడాపెడా టెస్టులు రాస్తున్నారు. ఇక డెంగ్యూ టెస్టు అంటే ఏలిసా టెస్టు చేయాలి. ఇది ఖమ్మం జిల్లాలో ఒక్క ఏరియా ఆసుపత్రిలో మాత్రమే రోగులకు అందుబాటులో ఉంది. దీంతో ఈ టెస్టును ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేయాలంటే రూ.1500 నుంచి 4000 వేల వరకు వసూలు చేస్తున్నారు. మలేరియా , టైఫాడ్ జ్వరాలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభ్యమయ్యే మందులతో రోగులకు ఉపశమనం కలుగుతొంది. కానీ వీటిపై అవగాహన కల్పించడంలో వైద్య సిబ్బంది నిర్లక్షం చేస్తున్నారు. దీంతో జ్వరం వచ్చిందంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 50వేల నంచి లక్ష రూపాయాలు ప్యాకేజిగా మార్చివేసి రోగుల నుంచి ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు.

Comments

comments