Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రోగాల గుప్పిట్లో పల్లెలు

 ప్రబలుతున్న విష జ్వరాలు 

 అల్లాడుతున్న ఏజెన్సీ
 కరువైన ముందు జాగ్రత్త చర్యలు

145 తీవ్రత యథావిధిగా కొనసాగుతుండడం లాంటి పరిణామాలు ప్రజలను రోగాల గుప్పిట్లోకి మళ్లీస్తున్నాయంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ పల్లెలు జ్వరాల బారిన పడుతుండడం మొదలైంది. పల్లెల్లో నీటి కలుషిత మంచి నీటితో పాటు పౌష్టికాహార లోపం లాంటివి ప్రజలను రోగాలకు దరిచేరుస్తున్నాయి. రోజుకో పల్లె చొప్పున మంచం పట్టడం మొదలయ్యింది. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుండి గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె కొనసాగిస్తుండడంతో పల్లెల్లో పారిశుద్ధ సమస్య తీవ్రమైంది. దీంతో గ్రామీణ ప్రాంతాలన్నీ దుర్ధందమయం అయిపోయాయి.

123తద్వారా వ్యాధులు క్రమక్రమంగా ప్రబలుతున్నాయి. కాగా పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఇప్పటికీ ముందు జాగ్రత్త చర్యలను మొదలు పెట్టలేదు. క్లోరినేషన్‌తో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోతుండడం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. ప్రతి యేటా సీజన్‌కు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్షంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవడం రివాజుగా మారింది. విస్తృత అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం ఆ శాఖను అభాసుపాలు చేస్తోంది. కాగా ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

comments