Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఈ రోడ్ల దుస్థితి మార్చేదెప్పుడు సారూ!

11BDN201బోధన్‌టౌన్: బోధన్ పట్టణంలోని రోడ్లపై నడవడమే కష్టంగా ఉందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోధన్ పట్టణంలోని అంతర్గత రోడ్ల పరిస్థితి అద్వానంగా మారింది. వర్షం చినుకు పడితే చాలు ఈ రోడ్లలో ప్రజలు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. సంవత్సరాలు గడుస్తున్న ఈ రోడ్ల పరిస్థితి ఇంతే ఉన్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

పట్టణంలో ప్రతి నిత్యం రద్దీగా ఉండే పలు రోడ్ల మరి అద్వానంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోటున్నారు. వర్షం పడి నీరు నిలవడంతో రోడుపై ఉన్న గుంతలు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదలు జరుగుతున్నాయి. బోధన్ పట్టణంలోని వీక్లీ మార్కెట్ రోడ్డు, పోస్టాఫీస్ నుండి రెంజల్ బేస్ రోడ్డు, శక్కర్‌నగర్ చౌరస్తా నుండి ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్డు, శ్రీనివాస టాకీస్ నుండి శివాలయం రోడ్డు ,శర్బత్ కెనాల్ నుండి హనుమాన్ టేకిడి వెళ్ళే అనిల్ టాకీస్ రోడ్డు, సరస్వతీ నగర్ కాలని రోడ్డు, ఆర్డివో కార్యాలయం ముందు నుండి రాకాసిపేట్ వెళ్ళే రోడ్లే కాకుండా పట్టణంలోని ద్యాకం గల్లీ,ఉద్దీమీర్‌గల్లీ లలో గల రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారడంతో కాలని వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. పట్టణంలో ఎప్పుడు రద్దీగా ఉండే సరస్వతినగర్ కాలనీ రోడ్డు గుంతల మయంకావడంతో ప్రయాణికులు ఈ రోడ్డు గుండా వెళ్లడానికి భయపడుతున్నారు.

ఈ కాలనీలో ఆస్పత్రులు, పలు విద్యాసంస్థలు ఉండటంతో విద్యార్థులతో, ఆసుపత్రికి వచ్చే వారితో ప్రతీ రోజు రద్దీగా ఉంటుంది. గుంతల మయం అయిన రోడ్లు వర్షం పడితే గుంతలలో నీరు నిలిచి ఉండటంతో వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో గుంతలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనాలు, ప్రజలు గుంతల్లో పడి ప్రమాదాలు జరిగిన సంఘటనాలు చాలా ఉన్నాయి. అయినా అధికారులు స్పందించడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి పట్టణంలోని రోడ్లును బాగు చేయాలని బోధన్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Comments

comments