Home రాజన్న సిరిసిల్ల వణుకుతున్న అనంతపల్లి

వణుకుతున్న అనంతపల్లి

Toxic-fever

ప్రబలుతున్న విషజ్వరాలు
పడకెక్కిన పారిశుద్ధం
భయాందోళనలో గ్రామస్థులు
పట్టించుకోని అధికారులు

చందుర్తి: విషజ్వరాల బారిన పడి అనంతపల్లి గ్రామస్థులు వణుకుతున్నారు. గ్రామంలో అస్థవ్యస్థంగా ఉన్న పారిశుద్ధ్యంతో, చెత్తచెదారం పేరుకపో యిన మురికికాలువలతో సతమతమతున్న గ్రామస్థులు సీజనల్ వ్యాధులకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. వివరాల్లోకి వెళితే రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం అనంతపల్లి గ్రామస్థులు వర్షకాలం కావడంతో సీజనల్ వ్యాధులతో బాధపడుతూ విషజ్వరాల బారిన పడి వణుకుతున్నారు. గ్రామస్థులు వ్యాధులకు గురవుతున్నప్పటికి గ్రామంలో మా త్రం ఎలాంటి పారిశుద్ధ చర్యలు తీసుకోవడం లేదు.

ముఖ్యంగా మురికికాలువలు చెత్తచెదారంతో పేరుకపోవ డంతో గ్రామపంచాయతీ సిబ్బంది కూడా చర్యలు తీసుకో కపోవడంతో పారిశుద్ధం ఎక్కడికక్కడ పడకేసింది. అలాగే గ్రామంలోని శుద్ధజల కేంద్రం కూడా మూతపడడంతో గ్రామస్థులు త్రాగునీరు సరిగ్గా లేకపోయింది. దీంతో గ్రామస్థులు రోగాల బారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆనంతపల్లిలో క్యాంపు నిర్వహించి, ఇంటింటికి వెళ్లి గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామం లో మాత్రం ఎలాంటి పారిశుద్ధ చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి విషజ్వరాలు వస్తున్నాయని, ఇప్పటికై నా సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకొని గ్రామస్థులను విషజ్వరాల బారి నుండి కాపాడాలని కోరుతున్నారు.