Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

వేసవికి ముందే నీళ్ల కష్టాలు

  • వేసవి ముందే తాగునీటి ఎద్దడి
  • నీటి కోసం మహిళల పడిగాపులు
  • పని చేయని బోరు బావులు
  • పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

Water-Shortageవెల్గటూర్: వేసవి కాలం రాక ముందే బోరు బావుల వద్ద మహిళలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి . ఇంకా నెల రోజుల తరువాత వచ్చే వేసవి కాలం ప్రారంభానికి ముందే మహిళలకు నీటి కష్టాలు ఎదురయ్యాయి. మండలంలోని సాక్షాత్తు జడ్‌పిటిసి సభ్యురాలు సొంత గ్రామం పైడిపల్లిలో తాగునీటికై కష్టాల పాలవుతున్నారు. గ్రామంలో నీటి ఎద్దడిని తొలగించుట కొరకు ఎంఎల్‌ఎ కోప్పుల ఈశ్వర్ కొత్త బావిని తవ్వించారు. కాని పాత బావి నీళ్లు పాడైపోతున్నాయని కొత్తబావి నీటిని వాడడం లేదు. పాత బావి చుట్టు ప్రక్కల కొన్ని కుటుంబాల వారు మలవిసర్జం చేయడంతో ఈ బావి నీటిని గ్రామంలోని మహిళలు, గ్రామస్తులు వినియోగించు కోవడానికి ముందుకు రావడం లేదు. కేవలం బోరు బావుల నీటిని మాత్రమే వాడుకుంటున్నారు.
గ్రామంలోని అన్ని వీధులకు పేరుకే పైపు లైన్లు ఉన్నాయి తప్ప అవి సరిగా పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామం ఉన్న బోరు బావులు గత కొన్ని నెలల తరబడి పనిచేయకపోయినా ప్రజాప్రతి నిధులు, అధికారులు పట్టించుకునే పాపానపోలేదు. ఎస్‌సి కాలనీలో నాలుగు బోరు బావులలో కేవలం ఒక్కటి మాత్రమే పని చేస్త్తుండడంతో కాలనీ వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులెదుర్కోవలసి వస్త్తోందని వాపోతున్నారు. గంగపుత్ర వాడలో పైపు లైన్లు ద్వారా నీళ్లు రాక ఇటు బోరువెల్ చెడిపోయి నీళ్లులేక తీవ్ర ఇక్కడా అదే దుస్థితి కొనసాగుతోంది. చెడిపోయిన బోరు బావుల బాగు చేయించమని అధికారులకు, ప్రజాప్రతి నిధులకు పలుమార్లు మొర పెట్టుకున్న పట్టించుకునే వారు కరువైనారని వీధి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై అధికారులు, ప్రజాప్రతినిధులు రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలను తక్షణమే తీర్చాలని గ్రామస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు .

Comments

comments