Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

People Take advantage of Welfare schemes

మన తెలంగాణ/గోవిందరావుపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. శుక్రవారం గోవిందరావుపేట మండల కేంద్రంలోని తారకరామ కాలనీకి చెందిన 34 మంది లబ్దిదార్లకు మంజూరైన డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి చందూలాల్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ఇండ్లు లేని ప్రజలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడకుండ నిరోధించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుబందు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రశేఖరావుకే దక్కిందన్నారు. అంతేకాకుండా గర్భిణి స్త్రీలకు కిట్టు, పేద కుటుంబంలో అమ్మాయి పెళ్ళి చేసేందుకు కళ్యాణలక్ష్మి, భర్త వదిలేసిన ఒంటరి మహిళ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జెట్టి సుజాత, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సూడి శ్రీనివాస్‌రెడ్డి, గ్రామకమిటీ అధ్యక్షులు తుంగతుర్తి యుగంధర్, హేమాద్రి, సూరపనేని సాయికుమార్, తహసిల్దార్ రవిరాజ్‌కుమార్, ఎంపిడిఓ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments