Search
Monday 24 September 2018
  • :
  • :

ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

People's development is the goal of the state government

రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న 

మన తెలంగాణ/సిర్పూర్(టి) : ప్రజల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ శాఖ, బిసి సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం మండలంలోని రూ.3 కోట్ల రూపాయల నిధులతో మంజూరైన గోదాంను, రూ. 90 లక్షలతో నిధులతో నిర్మించిన ఎంపిడిఓ నూతన కార్యాలయాన్ని, మండల కేంద్రం నుండి చీలపెల్లి వరకు రూ.14 కోట్ల నిధులతో మంజూరై రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందన్నారు. రైతులకు, ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఏ దేశంలో లేని విధంగా రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున మంజూరు చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అదే విధంగా గొర్రెల పంపిణీ, కార్పొరేషన్ రుణాలు, రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్‌లు మంజూరు చేసిందన్నారు. రైతులు అనివార్య కారణాల వల్ల మరణించినట్లయితే రూ.5 లక్షల బీమా అందిస్తుందన్నారు. అనంతరం ఆరె సంక్షేమ సంఘ భవన నిర్మాణం కోసం నిధులు, ఇటికల పహాడ్ రోడ్డు, కల్యాణ మండపం, పాతట్ల గూడ నుండి సిర్పూర్ వాగుపై చెక్‌డ్యామ్ నిర్మించాలని ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప మంత్రిని కోరగా స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి గోడం నగేష్, ఎంఎల్‌సి పురాణం సతీష్, ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప, కుమ్రం భీం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కాగజ్‌నగర్ ఆర్‌డిఒ రమేష్‌బాబు, జడ్‌పిటిసి అజ్మీర రాంనాయక్, ఎంపిపి నీరటి రేఖ, ఎంపిడిఓ జవహర్, తహసీల్దార్ యుగేందర్, వైస్‌ఎంపిపి సోహెల్ అహ్మద్, ఎంపిటిసిలు శంకరయ్య, చింతల సత్తయ్య, సర్పంచ్‌లు సయ్యద్ కిజర్‌హుస్సేన్, నిర్మల, కమల, ఆరెసంఘం అధ్యక్షుడు, రైతు మండల సమన్వయ అధ్యక్షుడు చౌదరి నానాజీ, నాయకులు తుస్సె దౌలత్, తదితరులు పాల్గొన్నారు. మంత్రి పర్యటన సందర్బంగా సిర్పూర్(టి) ఎస్‌ఐ రామారావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

మంత్రికి ఘన స్వాగతం…
సిర్పూర్(టి) మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు సోమవారం మండలానికి వచ్చిన మంత్రి జోగురామన్న, ఎంపి గోడెం, నగేష్, ఎంఎల్‌సి పురాణం సతీష్‌లకు టిఆర్‌ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్దబండ వద్ద పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు.

Comments

comments