Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ప్రజల ఆరోగ్యమే.. ప్రభుత్వ ధ్యేయం

madhusudana-chari-image

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన శాసన సభ స్పీకర్ సిరికొండ

మన తెలంగాణ/ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని తెలంగాణ రాష్ట్రశాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్పీకర్ క్యాంపు కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాలతో ప్రయివేట్ వైద్యం చేయించుకున్నా కుటుంబాలకు సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేశారు.నియోజకవర్గంలో వివిధ మండలాల నుండి 25 మంది అభ్ది దారులకుగాను రూ. 6 లక్షల 75 వేల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నియోజక వర్గంలో అనేక మంది ప్రజలు అనారోగ్య భారిన పడి వైద్యం చేయించుకున్నా కుటుంబాలకు కొంత మేరకు వారికి రిలీఫ్ నిచ్చే విధంగా సీఎం సహయనిధినుండి ఆర్థిక సహయం అందజేయడం జరుగుతుందన్నారు.గతంలో ఏప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులను తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేస్తున్నాడని ఆయన తెలిపారు.నియోజక వర్గంలో గతంలో ఏ ఎమ్మెల్యే చేయని పనులు చేయడం జరిగిందన్నారు.గత ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేషాయని అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రజల అవసరాలను గుర్తించి జిల్లా స్థాయి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించడం జరుగుతుందన్నారు.రాబోయో మూడు,నాలుగు నెలల్లో త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు 24 గంటల వైద్యసదుపాయం అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరగని అభివృద్ధి పనులు చేయడం జరగుతుందని తెలిపారు.నియోజక వర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పల్లె ప్రగతి నిద్ర చేయడం జరుగుతుందని అన్నారు.భూపాలపల్లి నియోజక వర్గాన్ని రాష్ట్రంలనే నెంబర్‌వన్ నియోజక వర్గంగా తీర్చిదిద్ధడం కోసం అహర్నిశలు శ్రమిస్తూన్నాని అన్నారు.వారంలో 5 రోజులు నియోజక వర్గంలోనే ప్రజల మద్యలోనే ఎంటున్నానని మీరందరు సహకరిస్తే సమస్యలు లేని నియోజక వర్గంగా భూపాలపల్లిని తీర్చుతానని స్పీకర్ తెలిపారు.ఈకార్యక్రమంలో మున్సిపాలిటి చైర్‌పర్సన్ బండారి సంపూర్ణ రవి, వైస్ చైర్మన్ గణపతి,టీఆర్‌ఎస్ నాయకులు సాంబమూర్తి,మందల రవిందర్ రెడ్డి,పైడిపెల్లి రమేష్,మేకల సంపత్ తదితరలు పాల్గోన్నారు.

Comments

comments