Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

Peoples problems should be solved quickly

మన తెలంగాణ/భూపాలపల్లి : జిల్లాలోని వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన వినతులను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గణపురం మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన రేగూరి రాజేష్ రెడ్డి మాది చాలాపేద కుటుంబం మాతండ్రి చిన్నతనంలోనే మరణించాడు నాతల్లి రెండు సంవత్సరాల క్రితం నన్ను పోషించలేనని వదిలి వెళ్లడం జరిగింది. నేను పదవ తరగతి పాస్ అయినాను, నాకు ఏదైనా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీటు ఇప్పించగలరని వేడుకున్నారు. ఏటూర్‌నాగారం మండల కేంద్రానికి చెందిన బట్టు సమ్మయ్య ఏటూర్‌నాగారం శివారులో నాకు సంబంధించిన 12 గుంటల భూమి మావారసత్వంగాఉంది. ఇటీవల భూరికార్డుల శుద్ధీకరణలో నాభూమి వేరే వ్యక్తి పేరు మీద మార్చినారు.

కావున భూమిని నాపేరుపై ఎక్కించగలరని,మంగపేట మండలం చించుపల్లి గ్రామానికి చెందిన మర్రి యాదిలక్ష్మి నేను గత 13 సంవత్సరాలనుండి మంగపేట పిహెచ్‌సిలో ఉన్న క్యాంటిన్‌లో కాట్రాక్ట వర్కర్‌గా పనిచేస్తున్నాను. నన్ను ఫిబ్రవరి నెలలో తొలగించి వేరో క్యాంటిన్‌లో పని కలిపిస్తామని ఇప్పటి వరకు పనికల్పించలేదు కావున నన్ను తిరిగి మంగపేట క్యాంటిన్‌లో పని చేయడానికి అనుమతించగలరని, ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన నాగవెల్లి రజిత నాభర్త అనారోగ్యంతో మృతి చెందినాడు కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాను నాకు కూతురు 8వ తరగతి ప్రవేశానికి ఏదైన కస్తూర్బా హస్టల్‌లో సీటు ఇప్పించగలరని, భూపాలపల్లి మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన బలుగురి కౌసల్య నాభర్త వెంకన్నకు మేము ఇద్దరం భార్యలం నాకు ముగ్గురు కూతుర్లు నాభర్త పేరుమీద 32 ఎకరాల భూమి గలదు అట్టి భూమిలో సగం ఆస్తిని నాముగ్గురు కూతుర్లకు రాసి ఇచ్చేవిధంగా ఆదేశించగలరు, రేగొండ మండలం గుడెపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్ నేను పుట్టుకతో వికళాంగున్ని నా రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి నేను నడువ లేని స్థితిలో ఉన్నాను నాకు ప్రభుత్వం నుండి ట్రై సైకిల్ మంజూర్ చేసి బాదితుడికి అప్పగించారు.మల్‌హర్‌రావు మండలం పాత రుద్రారం గ్రామానికి చెందిన రైతులు సర్వేనెంబర్ 286లో గల భూమిని మోక సర్వే చేసి పట్టాలు ఇప్పించాలని కలెక్టర్‌ను కోరుకున్నారు.ఈకార్యక్రమంలో మొత్తం 120 వినతులను కల్టెర్ స్వీకరించి సకాలంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబందిత అధికారులను ఆదేశించారు.

Comments

comments