హైదరాబాద్ : రబీ పంటకు పకడ్బందీగా సాగునీటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులు ఆదేశించారు. జలసౌధలో ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. చుక్కనీరు వృధాపోనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.