Search
Saturday 17 November 2018
  • :
  • :

ఉద్యోగాన్ని బాధ్యతతో నిర్వర్తించండి

Perform the job responsibility
నచ్చనోళ్లు బదిలీపై వెళ్లండి
సమస్యలు పరిష్కరించకుండా సృష్టిస్తున్నారు ఎందుకు
విద్యాశాఖ అధికారులపై  మండిపడ్డ కలెక్టర్

మన తెలంగాణ/మెదక్: ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతతో తమ శాఖలోని విధులను నిర్వర్తించి ప్రజల మన్నలను పొందాలి తప్పా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ టూర్ పేరుతో గైర్హాజరు అయితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు. సోమవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్షను చేపట్టారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు పాఠశాలకు తనిఖీల పేరిట వెళ్లి కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడమేంటని కలెక్టర్ మండిపడ్డారు. విద్యాశాఖలో విధులు నిర్వర్థిస్తున్న వారు సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. పాఠశాలల తనిఖీలు, పాఠశాలల్లో నిర్మించిన వాటి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. విద్యాశాఖకు కలెక్టరేట్ ఇన్‌వార్డు నండి తానే స్వయంగా పంపినప్పటికీ విద్యాశాఖ నుండి లిఖితపూర్వక సమాధానాలు రాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ పనితీరు సంతృప్తిగా లేదన్న ఆయన సుదీర్ఘంగా వివిధ అంశాలపై సమీక్షను నిర్వహించారు. ఇన్‌వార్డు నుండి విద్యాశాఖకు పంపిన లేఖలకు సమాధానాలు రాకపోవడంతో సూపరిండెంట్‌పై ఆగ్రహం వ్యకం చేశారు. స్వయంగా తాను పంపిన వాటికి సమాధానాలు ఇవ్వలేని స్థితిలో విద్యాశాఖ అధికారులు ఉన్నారని, నెలకు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ పనిచేయకపోతే ఎలా అని అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. కిందిస్థాయి సిబ్బంది తనకు సహకరించడం లేదని అందువల్లే పనులు పెండింగ్‌లో ఉన్నాయని సూపరిండెంట్ కలెక్టర్‌కు వివరించారు. కిందిస్థాయి ఉద్యోగులు విధులకు, తనకు సహకరించడం లేదని చెప్పడం అసమర్ధతతకు నిదర్శణమని మండిపడ్డారు. సహకరించని ఉద్యోగుల వివరాలను తనకు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో పనిచేయడం ఇష్టం లేని ఉద్యోగులు బదిలీలపై వేరే జిల్లాకు వెళ్లాలని, ఇక్కడే ఉంటే మాత్రం నిక్కచ్చిగా పనిచేయాల్సిందేనని ఆదేశించారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ టైంపాస్ చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత మూడు సంవత్సరాల క్రితం నిర్మాణాలు చేపట్టినా బిల్లులు మంజూరు కో సం ఇప్పటివరకు ఎందుకు తిప్పుకుంటున్నారని సెక్టోరియల్ ఆఫీసర్ నాగేశ్వర్‌నాయక్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని బాధ్యత నీపై లేదా అని మండిపడ్డారు. ఆయన స్థానంలో నిర్మాణా లు చేపట్టి బిల్లుల కోసం నువ్వు ఇలానే తిరిగితే సమస్యలు అర్థమవుతాయన్నారు. నీవు తీసుకునే జీతానికి చేస్తున్న పనికి నీకు సంతృప్తి ఉందా అని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న కస్తూర్భా పాఠశాలల్లోని విద్యార్థులు ఏ సమస్యలతో బాధపడుతున్నారో నీకు తెలుసా అని ఎస్‌వో సుభాష్‌ను ప్రశ్నించారు. నీవు రోజు ఎన్ని పాఠశాలలు తిరుగుతున్నావ్…? ఏం సమస్యలు గుర్తించావని, గుర్తించిన సమస్యలకు పరిష్కారాలు ఏవైనా చూపావా అని ప్రశ్నించారు. చేయాల్సిన పనులను చేయకుండా వేరే పనులు చేస్తాను అంటే కుదరదని ఇకపై ఇలాంటి సమస్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.

Comments

comments