Search
Tuesday 20 November 2018
  • :
  • :

పర్‌ఫార్మెన్స్‌తో కూడిన  గ్లామర్ రోల్స్ చేస్తా

Surabhiనాని, సురభి, నివేద ప్రధాన పాత్రల్లో మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జెంటిల్‌మన్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా సురభి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ “నేను తమిళంలో నటించిన ‘వేళ ఇల్లాద పట్టదారి’ అనే సినిమా తెలుగులో ‘రఘువరన్ బి.టెక్’ అనే పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళంలో మంచి సక్సెస్ అయింది ఈ చిత్రం. నాని ఆ సినిమాలో నన్ను చూసి దర్శకుడు ఇంద్రగంటికి చెప్పారు. ఆయనకు కూడా నా నటన నచ్చడంతో ‘జెంటిల్‌మన్’ సినిమాకు ఎంపిక చేశారు. నానితో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. నివేద మంచి అమ్మాయి. సినిమాకు ఇద్దరం కలిసి పనిచేసి మంచి స్నేహితులమైపోయాం. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాను. తెలుగులో రఘువరన్ బి.టెక్, బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా, జెంటిల్‌మన్… ఇలా వరుస విజయాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే ఇష్టం. అలాగే పెయింటింగ్ కోర్స్ కూడా చేశాను. తమిళ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అక్కడ రెండు, మూడు సినిమాలు చేసిన తర్వాత వరుసగా తెలుగు అవకాశాలు వస్తున్నాయి. నేను కథను ఎన్నుకున్నప్పుడు నా పాత్ర, డైరెక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ ఒకే చేస్తాను. పూర్తిస్థాయి గ్లామర్ రోల్స్ కాకుండా పర్‌ఫార్మెన్స్‌తో కూడిన గ్లామర్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను”అని చెప్పారు.

Comments

comments