Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

షోరూం యాజమాన్యాల సేవలో ఆర్టిఏ అధికారులు!

వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ షోరూంల్లోనే !
త్వరలో ఉత్తర్వులు ?
సరికాదంటున్న ఆటోయూనియన్ నాయకులు

Autos-Hyderabad

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఒక వైపు షోరూం యాజమాన్యాలు వాహన బేసిక్ ధర, ప్రభుత్వాని కి రావాల్సిన పన్ను మినహా అదనపు చార్జీలు వసూలు చేయకూడదనే సుప్రీం కోర్టు గైడ్‌లెన్స్ ఒక వైపు చెబుతుంటే మరో వైపు షోరూం యాజమాన్యాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చి వారి సే వలో మరింత తరించేందుకు సిద్ధం అవుతున్నారు. నగరంలో షోరూం నిర్వాహకులకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఇచ్చే ప్రక్రియకు అధికారుల దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా త్వరలో వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం.

ఇప్పటికే నగరంలోని వివిధ వాహన షోరూం నిర్వాహకులకు ప్రస్తుతం అప్పగించిన తాత్కాలిక రిజిస్ట్రేషన్ ద్వారానే పెద్ద ఎత్తును వాహన దారులను దోచుకుంటున్నారు .ఇక వారికి శా శ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను అప్పగిస్తే వారి దోపిడి అడ్డే ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నగరంలోని ఆర్టీఏ కార్యాయాల్లోని అధికారులు షోరూం నిర్వాహకులు చేతుల్లో ఉన్నారని వారు చెప్పిందే వేదంగా అధికారులు పాటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆర్టీఏ అధికారుల తీసుకునే ఇటువంటి చర్యల పట్ల అది వాస్తవ రూపం కూడా దాల్చే అవకాశం ఉంది.తాత్కాలిక రిజిస్టేషన్‌కు రవాణా శాఖ అధికారులు రూ.100 , పర్మినెంట్ రిజిస్టేషన్‌కు రూ.395 మాత్రమే వసూలు చేస్తా రు. కాని షోరూం నిర్వాహకులు మాత్రం ద్విచక్ర వాహానానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం రూ. 600,లు శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రూ.1000 వసూలు చేస్తు వాహన దారులను నిలువునా దోచుకుంటున్నారు. నగరంలో చిన్నా పెద్దా కలిసి సుమారు 300లకు పైగా ద్విచక్ర వాహన షోరూం ఉ న్నాయి. ప్రధాన వాహన డీలర్లు నెలకు సుమారు 250 వాహాలను అమ్మితే ప్రతి వాహనానికి అదనపు చార్జీల పేరుతో రూ .5000 వసూలు చేస్తే వారు వాహన దారుల నుంచి దోచుకున్న సొమ్ము .1.25 లక్షలకు వుంటుంది. ఈ విధంగా వాహన దారులను దోచుకుంటున్న షోరూం నిర్వాహకుల కు వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కూడా కల్గిస్తే వారి దోపిడి అడ్డే వుండదనే విమర్శలు వస్తున్నాయి.

అంతే కాకుండా షోరూం నిర్వాహకులు వ్యాపార దృక్పథం వుంటుందే కాని ఏదో పౌర సేవ చేయాలన్న ఆలోచన ఏ మాత్రం ఉండదు. వారు లాభార్జనే లక్షంగా పని చేసే అవకాశం వుంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ఈ విధంగా ఆర్టీ ఏ అధికారులు షోరూం నిర్వాహకులకు శాశ్వత రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్గిస్తే వారితో చేతులు క లిపినట్లు అవుతుంది. పని ఓత్తిడి తగ్గించుకునేందుకో, సిబ్బంది కొరత పేరుతోనే, ఇతర కారణాలతో ఇటువంటి విధానాలను అవలంభిస్తే ఆర్టీఏ అధికారులు సమర్థతపై కూడా అనేక అనుమానాలు కూడా వాహన దారుల్లో వస్తున్నాయి. ఈ విధంగా అధికారులు తాము నిర్వహించాల్సిన పనులను ప్రైవేట్ పరం చేస్తే అధికారులు ఆర్టీఏ కార్యాలయాల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం వుం టుంది. ఏపీ,పంజాబ్,మహారాష్ట్ర, రాజస్తాన్,డిల్లీ లలో ఈ విధానంగా అమలు అయినంత మాత్రన ఇక్కడ కూడా అమలు చేస్తామనడంలో అర్థం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వఖజానాకు నష్టం వాటిల్లుతుంది : వి మారయ్య (టిఆర్ ఎస్కేవి)

షోరూం నిర్వాకులకు శాశ్వత రిజిస్ట్రేషన్ అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవ డం సరికాదని తెలంగాణ ఆటో మోటార్స్ డైవర్స్ ట్రేడ్ యూనియన్ రా ష్ట్ర అధ్యక్షుడు వి.మారయ్య అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా చే య డం ద్వారా అధికారులు బాధ్యతల నుంచి తప్పింకున్నట్లు కావడమే కా కుండా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందంటున్నారు. ఇప్పటికే అధికారులు షోరూం నిర్వాహకులు ఇచ్చిన త్కాలిక రిజిస్ట్రేషన్ చార్జీలను ఆర్టిఏ అధికారులు నిర్ణయించిన ధర కంటే అదనంగా వసూలు చేస్తూ వాహన దారులు చేబులకు చిల్లు పెడుతున్నారు.

షోరూంలకు శాశ్వత రిజిస్ట్రేషన్ సరికాదు : ఆటో యూనియన్ నాయకుడు సత్తిరెడ్డి

వ్యాపార ప్రయోజనాలే లక్షంగా పని చేస్తున్న వాహన షోరూం నిర్వాహకులకు శాశ్వత రిజిస్ట్రేషన్ కల్పిస్తూ అధికారులు తీసుకునే నిర్ణయం సరికాదని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఎ. సత్తిరెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తాత్కాలిక రిజిస్ట్రేషన్ ద్వారానే వాహన దారులు నుంచి అదనంగా వసూలు చేస్తున్నారని, ఇటువంటి సమయం లో వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ అవకాశం ఎలా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు.

దోపిడికి అవకాశం ఎక్కువ : బి.వెంకటేషం (ఏఐటియూసి)

రవాణాశాఖ అధికారులు పని భారం ఎక్కువ ఉందనో.. సిబ్బంది కొరత ఉందనో వారి చేసే విధులను ఈ విధంగా షోరూం నిర్వాహకులకు అప్పగించడం సరికాదని ఏఐటియూసి నాయకులు బి.వెంకటేశం అంటున్నా రు. సిబ్బంది తక్కువ ఉన్నా, పని భారం ఎక్కువైనా అదనపు సిబ్బంది ని యమించుకోవాలనే కానే ఇటువంటి చర్యలు సమర్దనీయం కాదన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా యువత ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాద ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments