Home హైదరాబాద్ మరో 500 స్వచ్ఛ ఆటోలు

మరో 500 స్వచ్ఛ ఆటోలు

Permission to buy another 500 volunteer auto tipers

బల్దియా స్థాయీసంఘంలో తీర్మానం

మన తెలంగాణ/సిటీబ్యూరో : ప్రతిజోన్‌లో ఒక సర్కిల్‌ను బిన్ ప్రీ సర్కిల్‌గా చేసేందుకు మరో 500 స్వచ్ఛ ఆటోటిప్పర్లను కొనుగోలు చేయడానికి అనుమతించేందుకు ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలకు మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) స్థాయీసంఘం ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ తీర్మానించింది. గురువారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన స్థాయీసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 24 అంశాలపై సభ్యులు చర్చించారు. 24 అంశాలను ఆమోదం తెలిపారు. ఎక్కువ శాతం రోడ్డు విస్తరణ, అభివృద్ది పనులు, ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.