Home తాజా వార్తలు ఇదో కొత్త రకం బెదిరింపు

ఇదో కొత్త రకం బెదిరింపు

Cell-Towerహైదరాబాద్ : ఇప్పటి వరకు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయితేనో.. లేక ప్రేమలో విఫలమైతేనో సెల్ టవర్లు ఎక్కి బెదించించే వారిని మనం చూశాం. కాని మంగళవారం ఇందుకు విరుద్దంగా ఓ కొత్త కారణంతో వ్యక్తి సెల్ టవర్ పైకి ఎక్కి అందరిని విస్మయానికి గురి చేశాడు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తాను పొర్లు దండాలు పెడుతూ అసెంబ్లీ చేరుకుంటానని మొక్కుకున్నానని అందుకు అనుమతించడం లేదని వ్యక్తి సెల్ టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరింపుకు దిగాడు. మియాపూర్ ప్రాంతానికి చెందిన మల్లేష్ గౌడ్ రాష్ట్రం ఏర్పడితే అసెంబ్లీ వద్దనున్న అమర వీరుల స్తూపం వరకు పోర్లు దండలు పెడుతూ వస్తానని దేవుడితో మొక్కుకున్నట్లు పేర్కోన్నాడు. ఈ మేరకు అనుమతి కోసం నగర పోలీసులకు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపాడు. వారు ఇందుకు నిరాకరించడంతో మంగళవారం సదరు వ్యక్తి మియాపూర్ సెల్ టవర్ పైకి ఎక్కి తన డిమాండ్‌ను ఒప్పుకోకుంటే దూకేస్తానని బెదిరింపుకి దిగాడు. ప్రస్తుతం నగర పోలీసులు మల్లేష్‌తో చర్చలు జరుపుతున్నారు. ఇది మల్లేష్ కేవలం ప్రచారం కోసం చేస్తున్నాడా… లేక నిజంగానే రాష్ట్రం మీద భక్తితోనా అని ప్రజల్లో అనుమానం వ్యక్తమవుతుంది.