Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పోలీస్‌స్టేషన్ ముందు వ్యక్తి ఆత్మహత్యయత్నం

Person commit suicide in banjarahills
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్  ముందు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రోడ్ నంబర్ 5 లోని దేవర కొండ బస్తీకి చెందిన మనోజ్ సాఠీ అనే వ్యక్తి కుమార్తెను ముషీరాబాద్ కు చెందిన సతీష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. సతీష్ ఓ బ్యాంక్‌లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల భార్య, భర్తల మద్య తరుచూ గొడవలు జరుగుతుండటంతో తన పుట్టింటికి వెళ్లింది. దీంతో సతీష్ తల్లి, తమ్ముడు, మరికొంత మంది బంధువులు కలిసి దేవర కొండ బస్తీలోని మనోజ్ సాఠీ ఇంటికి అర్ధరాత్రి వెళ్లి గొడవ పడ్డారు. గొడవకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీసులకు సతీష్ వాళ్ల మామ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు విషయం తెలుసుకున్న సతీష్ తమపై పెట్టిన ఫిర్యాదును తక్షణమే వెనుకకు తీసుకోవాలని లేకపోతే ఆత్మహత్యకు పాల్పడతానంటు సతీష్ మనోజ్ సాఠీ కు ఫోన్ చేశాడు.

అతను ఫోన్ చేసి బెదిరించడంతో ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడానికి మనోజ్ బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. తాను పోలీస్‌స్టేషన్‌కు వచ్చానని మాట్లాడేందుకు గాను స్టేషన్‌కు రావాలని మనోజ్, సతీష్‌కు ఫోన్ చేసి చెప్పాడు. స్టేషన్ కు వస్తూ వస్తూ తనతో పాటు  పెట్రోల్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లాడు. పోలీస్‌స్టేషన్ కు రాగానే కొంత దూరంలోనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు భాదితుడిని కాపాడానికి ప్రయత్నించారు. అప్పటికే సతీష్ తీవ్రంగా గాయపడ్డాడు. తక్షణమే సతీష్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సలహా మేరకు కంచన్‌బాగ్‌లోని డిఆర్‌డిఒ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం సతీష్ పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. రెండు మూడు రోజులు గడిస్తే కాని ఏ విషయాన్ని చెప్పలేమని వైద్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Comments

comments