Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Person Committed Suicide at Kadapa

కడప : వేంపల్లిలోని ఓ లాడ్జిలో అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రొద్దుటూరు వినాయక నగర్‌కు చెందిన బొమ్మిశెట్టి గండ్రరాయుడు(50)గా గుర్తించారు. కొంత కాలంగా గండ్రరాయుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పుల బాధ భరించలేకనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని స్థానికులు తెలిపారు. మృతుడు గండ్రరాయుడు నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం గండ్రరాయుడు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person Committed Suicide at Kadapa

Comments

comments