Home జనగామ మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య…

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య…

Person committed suicide with family problems

జనగామ: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మరియాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మరియాపురం గ్రామానికి చెందిన ఎర్రవెల్లి కుమార్ (40)కు గత పదమూడేళ్ల క్రితం తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. మృతుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలసవెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇలా సజావుగా సాగుతున్న కాలంలో గత కొన్ని రోజులుగా భార్య భర్త మధ్య మనస్పర్థలు ఏర్పడి భర్త నుండి విడాకులు తీసుకొని తన ఇంట్లో ఉంటుంది. మృతుడికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. భార్యా పిల్లలకు దూరమై ఒంటరితనాన్ని జీర్ణించుకోలేక మనస్తాపానికి గురై శనివారం తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజేష్‌నాయక్ తెలిపారు.