Home తాజా వార్తలు వడదెబ్బతో వ్యక్తి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి

Sunstrokeవనపర్తి ప్రతినిధి: వనపర్తి పట్టణ కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన గంధం సాయిలు వడదెబ్బకు గురై గురువారం మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసు కున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలతో కలిసి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం రూ. 5వేలు అందజేశారు. సాయిలు కుటుంబానికి అండగా ఉంటామని, ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి హామీ ఇచ్చారు.  మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, జడ్పిటిసి అభ్యర్థి లోక్‌నాథ్‌రెడ్డి, కౌన్సిలర్స్ వాకిటి శ్రీధర్, గట్టుయాదవ్, ఎంపిపి శంకర్ నాయక్, నాయకులు బండారు కృష్ణ, కౌన్సిలర్స్ కమలమ్మ, ఇందిరమ్మ, నాయకులు పరంజ్యోతి, డా. దాని యేలు, శాంతన్న, జయానంద్, శ్యామ్, డి.శ్యామ్, టిఆర్ ఎస్ నాయకులు, కాలనీవాసులు ఉన్నారు.

Person Dead With Sunstroke In Wanaparthy