Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Person death in the chilkur road accident
హైదరాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చిలుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మునగాల మండలం వెంకటరామపురం గ్రామానికి చెందిన మంగళగిరి హుసేన్ (25) మోటర్‌సైకిల్ పై హుజుర్‌నగర్, వైపు నుండి కోదాడకు వెళ్ళుతుండగా గోదము దగ్గర గాలి మిషన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొన్నడంతో హుసేన్ తలకు తీవ్ర గాయాలై  అక్కడికక్కడే మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని పంచనామకు కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన్నారు.బంధువులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దార్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ సుధీర్‌కుమార్ తెలిపారు.