Home భద్రాద్రి కొత్తగూడెం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

person death in the road accident

బూర్గంపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంభందించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ముసలిమడుగు గ్రామానికి చెందిన సర్సయ్య(38) తన కుమారుని బూర్గంపాడు మండల కేంద్రంలోని బిసి హాస్టల్లో చేర్చేందుకు వస్తున్న క్రమంలో పులి తేరు వాగు వద్దకు చేరుకొనే సమయంలో ఎదురుగా వస్తున్న బస్సును తప్పించే క్రమంలో టాటా ఏసిని ఢీ కొని రోడ్డు పై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.