Home ఆదిలాబాద్ ఆటో బోల్తా – ఒకరు మృతి

ఆటో బోల్తా – ఒకరు మృతి

autooooదిలావర్‌పూర్ : మండలంలోని సిర్గాపూర్ అనుబంధ గ్రామమైన మాయాపూర్ గ్రామానికి చెందిన బండ్లమీది పెద్ద సాయన్న ఆదివారం తెల్లవారుజామున నిర్మల్ మండలం మంజులాపూర్ సమీపంలో ఆటో బోల్తా పడడంతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే… మృతుడు పెద్ద సాయన్న తన సొంత భూమిలో పండించిన కూరగాయాలను మార్కెట్‌కు తరలిస్తున్న క్రమంలో ఉదయం ఆటో నంబర్ ఎపి01ఎక్స్ 6690 ఆటోలో ప్రయాణిస్తుండగా నిర్మల్ మండలంలోని మంజులాపూర్ గ్రామానికి సమీపంలో రోడ్డుపై ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో సాయన్న అక్కడికక్కడే మరణించాడు. ఆటోలో నరేష్‌గౌడ్, చాకలి బక్కన్నకు స్వల్పగాయాలయ్యాయి.