Home జాతీయ వార్తలు కొడైకెనాల్‌లో రోడ్డు ప్రమాదం … ఒకరి మృతి

కొడైకెనాల్‌లో రోడ్డు ప్రమాదం … ఒకరి మృతి

Person died in Road Accidentతమిళనాడు  : కొడైకెనాల్ లో సోమవారం ఉదయం  రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కొత్త ఏడాది  వేడుకల కోసం కొందరు యువకులు కేరళలోని తిరుచూర్ నుంచి కొడైకెనాల్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Person died in Road Accident