Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Person died in Road Accident

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మండలం రగుడు శివారులోని రంగినేని ట్రస్ట్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. బైక్, ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సిరిసిల్లకు చెందిన సత్యనారాయణ అనే రైస్ మిల్లర్ యజమాని మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం సత్యనారాయణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person died in Road Accident

Comments

comments