Home ఆదిలాబాద్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి…

Person died in road accident

ఆదిలాబాద్: అదుపుతప్పిన బైక్ డివైడర్ ను ఢీకొట్టిన ఘటన జిల్లాలోని గుడిహత్నూర్ మండలం డోంగర్ గామ్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారంత ఇంద్రవెళ్లి మండలం పాటగూడ వాసులుగా పోలీసులు గుర్తించారు.