Home తాజా వార్తలు లారీ ఢీకొని ఒకరు మృతి…

లారీ ఢీకొని ఒకరు మృతి…

Person dies

 

ఇల్లందు: దేవునిపై నమ్మకంతో ఆయనను స్మరించుకుందామని ద్విచక్ర వాహనంపై బయలుదేరిన భార్యభర్తలకు మృత్యురూపంలో వచ్చిన లారీ ఢీకొడంతో భర్త అక్కడికక్కడే మరణించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని నామాలపాడు గ్రామానికి చెందిన వరుస వీరస్వామి (55) తన భార్య గురువమ్మతో కలసి పట్టణానికి సమీపంలోని రైల్వేగేట్ వద్ద చర్చిలో ప్రార్ధనకు బయలుదేరాడు. అదే క్రమంలో చర్చి సమీపంలో అక్కడే ఆగివుందనకున్న లారీని డ్రైవర్ ఒక్కసారిగా వెనుకకు పోనివ్వడంతో అటుగా వస్తున్న ద్విచక్ర వాహనని ఢీకొట్టింది. దీంతో బలమైన గాయం తగలడంతో  వీరస్వామి అక్కడే మృతి చెందాడు. మృతుడు భార్య గాయాలపాలవడంతో స్థానికులు ఆమెను వేంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరస్వామికి ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు వున్నారు. ఆయన మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Person dies in lorry accident at Bhadradri kothagudem