Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి

Person killed in suspicious condition
బాలానగర్‌: వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బాలానగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస తెలిపిన వివరాల ప్రకారం… బాలానగర్ మండలం నందారం గ్రామ పంచాయతి పరిధిలోని పిట్టిక్యాస్టింగ్ పరిశ్రమలో సూపర్ వైజర్‌గా గత 8 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న వెస్ట్ బెంగార్ రాష్ట్రానికి చెందిన రాజుఘోష్ (32) శనివారం విధులు ముగించుకొని బయటకు వచ్చిన వ్యక్తి ఆదివారం ఉదయం గుండేడ్ గ్రామ పంచాయతి పరిసర ప్రాంతంలో ఒక చెక్కుకు ఉరి వేసుకోవడంతో స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు. బాలానగర్ ఎస్‌ఐ శ్రీనివాస మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతి చెంది ఉన్నాడు. పొట్ట కూటికోసం కుటంబాన్ని వదులుకొని వచ్చి జీవనం గడుపుతున్న వ్యక్తి మృత్యువాత పడటంతో స్థానికుల ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వ్యక్తి చెట్టుకు బెల్టుతో ఉరి వేసుకొని ఉండటం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని పలువురు పేర్కోంటున్నారు. మృతుని తమ్ముడు సుభాష్ ఘోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Comments

comments